Prabhas 25th film Spirit Spicy Updates : ప్రభాస్ 25 వ సినిమా గా స్పిరిట్ :-

Prabhas 25th film Spirit Spicy Updates : గత వారం రోజుల నుంచి చిత్రసీమ లో ప్రభాస్ ల్యాండ్ మార్క్ సినిమా అదేనండి ప్రభాస్ 25 వ సినిమా గురించే విపరీతంగా చర్చలు జరిగాయి. మొత్తానికి ఈరోజు ఈ టాపిక్ పైన ప్రభాస్ మరియు 25 వ సినిమా చిత్రబృందం స్పష్టత ఇచ్చేసింది.
మ్యాటర్ లోకి వెళ్తే ప్రభాస్ ల్యాండ్ మార్క్ సినిమా టైటిల్ స్పిరిట్ అని , ఈ సినిమాని టాలీవుడ్ గేమ్ చెంజర్ దర్శకుడైన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన బోతున్నారని , ఈ సినిమాని టి.సిరీస్ సంస్థ , భద్రకాళి పిక్చర్స్ మరియు యు.వి. క్రియేషన్స్ జంటగా నిర్మించబోతున్నారని అధికారికంగా ప్రకటించేశారు.
ప్రభాస్ కి క్లాస్ మరియు మాస్ ఇమేజ్ ఎలాగో ఉంది. అటు చుస్తే కల్ట్ సినిమా కి కేర్ అఫ్ అడ్రస్ అయినా సందీప్ రెడ్డి , ఈ రెండు ఊహించుకుంటే అభిమానులకి మరియు సాధారణ ప్రజలకి రెట్టింపు ఆనందం కలిగింది. స్పిరిట్ పోస్టర్ చూస్తేనే మరో కల్ట్ ఫిలిం లోడింగ్ అని చెప్పకనే చెప్పెశారు చిత్ర బృందం. మొత్తానికి అర్జున్ రెడ్డి ని మించిపోయే కథగా స్పిరిట్ రాసుకున్నారని అర్ధం అయింది.
ఇదిలా ఉండగా ప్రభాస్ కూడా ” నా 25 వ సినిమా కి ఇంతకంటే మంచి కథతో రాలేను , నా ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలని కోరుకుంటారో దానికి మించి ఉంటుంది. త్వరగా ఈ సినిమా స్టార్ట్ చేయాలనీ ఉంది ‘ అన్ని ప్రభాస్ చెప్పారు. మొత్తానికి ప్రభాస్ 25 వ సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూసే అందరికి ఈ వార్తతో ఎదురుచూపు ముగిసి సెలెబ్రేషన్స్ కి దారి తీసింది. ఈ సినిమా పై మరిన్ని అప్ డేట్స్ త్వరలో అధికారికంగా వెల్లడిస్తారు.