Prabhas : సలార్ టీజర్ జనాల స్పందన ఎలా ఉందంటే…..
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్.. ఆ సినిమా తర్వాత వరుసగా మూడు ఫ్లాప్ లు చవిచూడాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులిపిన బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సాహో,రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే సినిమాలు ప్లాప్ అయితేనేమి .. రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మాత్రం రోజురోజుకి లెక్కలేనంతగా పెరిగిపోతుంది.

ఇది ఇలా ఉంటే కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సలార్ టీజర్ విడుదలైంది. జూలై 6 తెల్లవారుజామున విడుదలైన ఈ సలార్ టీజర్ నెటింట్లో తెగ హల్చల్ చేసింది. ప్రభాస్ ప్రశాంత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు. ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ గా నిలవడం విశేషం. జూలై 6 తెల్లవారుజామున 5:12 గంటలకు రిలీజైన ఈ టీజర్ జూలై 7 ఉదయం 7 గంటల వరకూ 8.5 కోట్ల వ్యూస్, 16 లక్షల లైక్స్ రావడం గమనర్హం.వాస్తవానికి సలర్ టీజర్ ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో నెటింట్లో విమర్శలు వెల్లువెత్తాయి.


మూవీ యూనిట్ సలర్ టీజర్ ని 5:12 గంటలకు విడుదల చేస్తామని విపరీతమైన హైపునిచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానులు అల్లారం పెట్టుకొని మరీ టీజర్ కోసం వేచి చూశారు. కానీ ఆ టీజర్ ప్రభాస్ అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. “సింపుల్ ఇంగ్లీష్.. నో కన్ఫ్యూషన్… లయన్, చిరుత, టైగర్, ఎలిఫెంట్ వెరీ డేంజరస్.. బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. టీజర్ బ్యాక్ గ్రౌండ్ విజువల్స్ ని బట్టిని చూస్తే ఈ సలార్ సినిమా కేజిఎఫ్ 2ని తలదన్నేలా ఉండబోతుందని మాత్రం అర్థం అవుతుంది. ఈ సలార్ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు