పవర్ స్టార్ రివ్యూ

సినిమా :- పవర్ స్టార్ (2020)
నటీనటులు :- నరేష్ చల్లకోటి ,ధనుంజయ్ ప్రభునే , మహేష్ కత్తి
డైరెక్టర్ :- రామ్ గోపాల్ వర్మ
powerstar review: కరోనా కాలాన్ని కూడా బాగా సద్వినియోగం చేసుకునే దర్శకుడు వర్మ ఒక్కడే. అలాంటి వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద సినిమా తీసి ఈరోజు విడుదల చేశాడు. ఎన్నో వివాదాలకు దారి తీసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కథ :
ఈ కథ ప్రవన్ కళ్యాణ్ ( నరేష్ చల్లకోటి) మనసేన పార్టీ తరుపున ఎన్నికలలో పోటీచేసి ఓటమితో తీవ్ర నిరాశ చెందిన రోజు నుండి చిత్రం మొదలవుతుంది. ప్రవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఏ ఒక్క చోట గెలవలేకపోతాడు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రవన్ కళ్యాణ్ జీవితం ఎలా అయిపోతుంది? ప్రవన్ కళ్యాణ్ కి వాళ్ళ అన్న మరియు అతనికి ఎంతో కావల్సిన వాళ్ళు ఏం చెప్పారు? ప్రవన్ కళ్యాణ్ ఏం చేయాలనుకున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే 37 నిమిషాల ఈ సినిమా చూడాల్సిందే.
👍
- ఇదంతా పేరడీ సినిమా కాబట్టి నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
- పవన్ కళ్యాణ్ గా నరేష్ బాగా ఇమిటేట్ చేశాడు.
- టెక్నిషియన్స్ ఎవరి పేరూ బయటపెట్టలేదు కాబట్టి ఏం చెప్పలేము.
- కెమెరా వర్క్ బాగుంది.
- చివరి పది నిముషాలు ఆర్.జి.వి చెప్పే మాటలు నిజమేమో అనిపిస్తాయి.
👎
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా చేయొచ్చు అని అనిపించింది.
- తక్కువ చేసి మాట్లాడానికి పెద్దగా ఏమి లేవు.
ముగింపు :-
ఆర్.జి.వి. తీసిన పవర్ స్టార్ సినిమా మీద ఎంత నెగిటివిటీ వచ్చినా,గొడవలు జరిగినా రాము సినిమాని రిలీజ్ చేశాడు. ఈ సినిమా అంతా పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతుంది. ఎక్కడా పవన్ కళ్యాణ్ ని తక్కువ చేసి చూపించలేదు. పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేశాడు అతని పరాజయం వెనక గల కారణాలు ఏంటో చెప్పడానికి. ఈ చిత్రం చూశాక పవన్ కళ్యాణ్ అభిమానుల కోపం తగ్గొచ్చు. మొత్తం మీద పవర్ స్టార్ సినిమా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన స్వీట్ లవ్ లెటర్ వంటిది.
యివ్వటం వేస్ట్ కాబట్టి ఇవ్వము