Pawan Kalyan: పవర్ స్టార్ గుండు కొట్టించు కోబోతున్నాడా?

2018 లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ పవర్ స్టార్ సినిమాలపై దృష్టి సారించాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన వకిల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని…టీజర్ విడుదలకు రెడీగా ఉంది.

ఇంకా పవర్ స్టార్ రెండు, మూడు చిత్రాలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు శాతకర్ణి డైరెక్టర్ క్రిష్ పవన్ కళ్యాణ్ తో ఒక చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన వార్త తెలిసింది.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. అందులో ఒక పాత్ర కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుండు చేసుకోవాల్సి వస్తుందని టాక్. చిత్రంలో ఈ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉండడంతో గుండు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్టు సమాచారం. మరి ఈ వార్త నిజమో? కాదో? అని తెలియాలంటే వేచి చూడాల్సిందే