Vakeel Saab Teaser: కోర్టులో వాదించడము తెలుసు.. కోర్టు తీసి కొట్టడము తెలుసు.

2018 లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. తాజాగా మళ్లీ వకిల్ చిత్రంతో పవర్ స్టార్ ప్రేక్షకులను అలరించాడానికి సిద్ధమయ్యాడు.
ఈ వకిల్ సాబ్ చిత్రం బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “పింక్” సినిమా రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ పింక్ సినిమాలో లాయర్ గా నటించిన అమితాబ్ పాత్రనే వకిల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరాం వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అయిన దిల్ రాజు నిర్మిస్తున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా పవర్ స్టార్ అభిమానులకు చిత్ర బృందం కానుకగా వకీల్ సాబ్ టీజర్ ని విడుదల చేసింది. మొదట ఈ టీజర్ లో పవర్ స్టార్ లాయర్ కోట్ వేసుకొని.. దుమ్ములేపే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత కోర్ట్ లో జరిగే సన్నివేశంలో పవర్ స్టార్ అబ్జెక్షన్ యువరానర్ అని గంభీరంగా అంటాడు.
అనంతరం మెట్రోలో రౌడిల తాట తీస్తూ..కోర్టులో వాదించడము తెలుసు.. కోర్టు తీసి కొట్టడము తెలుసు అనే కిరాకు డైలాగ్ ను పవన్ కళ్యాణ్ చెపుతాడు…