Pooja to Romance with Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సరసన నటించేందుకు సిద్దమవుతున్న బుట్ట బొమ్మ :-

Pooja to Romance with Pawan Kalyan : ఇప్పటికే మీకు మ్యాటర్ అర్ధం అయింటది. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఉన్నపటికీ ఏ సినిమా కి ఎన్ని రోజులు షూట్ ప్లాన్ చేయాలో పకట్బంధీగా ప్లాన్ చేసుకొని షూట్ చేస్తున్నారు.
అందులో హరి హర వీర మల్లు , భీమ్లా నాయక్ , భవదీయుడు భగత్ సింగ్ , సురేందర్ రెడ్డి సినిమా ఇలా వరుసగా షెడ్యూల్ ప్లాన్ చేసుకొని సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ తో చేసే సినిమా భవదీయుడు భగత్ సింగ్ సినిమా. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
ఈ సినిమాలో పవన్ నెవెర్ బిఫోర్ లుక్ లో , ఈ సారి ఎంటర్టైన్మెంట్ ఏ కాకుండా ఇంకా స్పెషల్ గా చేస్తున్నాం అని అధికారికంగా వెల్లడించారు. అయితే ఈ సినిమాలో పవన్ సరసన ఎవరిని పెట్టాలో చిత్రబృందం ఆలోచించగా మొత్తానికి బుట్ట బొమ్మ ని అదేనండి పూజ హెగ్డే ని ఫైనల్ చేసినట్లు చిత్రసీమలో టాక్ నడుస్తుంది.
పవన్ మరియు పూజ కలిసి మొదటిసారి ఆన్ స్క్రీన్ లో కనిపించబోతున్నారు. వీరి పెయిర్ ఎలా ఉండబోతుందో అని ఆశక్తిగా మారింది. అయితే హరీష్ శంకర్ దర్శకత్వం లో పూజ ఇప్పటికే రెండు సార్లు నటించింది. ఒకటి దువ్వాడ జగన్నాధం మరియు గడ్డలకొండ గణేష్. ఇపుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ ఉండబోతుంది.
చూడాలి మరి పూజ హెగ్డే, పవన్ సరసన ఏ రేంజ్ లో ఉండబోతుందో. ఈ కాంబినేషన్ పై చిత్రబృందం అధికారంగా ఎపుడు వెల్లడిస్తారో చూడాలి. ఈ అక్టోబర్ లో ఈ సినిమాకి సంబందించిన పూజ కార్యక్రమాలు జరగబోతున్నట్లు తెలుస్తుంది.