Pooja Hegde Dream of Maharani Biopic : బయోపిక్ మీద ఆశక్తి చూపిస్తున్న బుట్టబొమ్మ :-

Pooja Hegde Dream of Maharani Biopic : అవును మీరు విన్నది నిజమే బుట్టబొమ్మకి బయోపిక్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. బుట్టబొమ్మ అంటే ఎవరో అనుకునేరు మన పూజ హెగ్డే. అవును పూజ హెగ్డే కి సడన్ గా బయోపిక్ తీయాలనే కోరిక కలిగింది అని చెప్పకనే చెప్పింది.
మ్యాటర్లోకి వెళ్తే ఇటీవలే జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో పూజ హెగ్డే తనకి బయోపిక్ తీయాలని ఎప్పటినుంచో ఉన్న కోరిక అని చెపింది. ఎవరి బయోపిక్ అని అడగగా పూజ ‘ జైపూర్ మహారాణి గాయత్రీ దేవి ” గారి బయోపిక్ అని చెప్పేసింది.
జైపూర్ మహారాణి గాయత్రీ దేవి గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. 1919 సంవత్సరం లో గాయత్రీదేవి గారు జన్మించగా 1940 నుంచి 2009 అంటే వారి చివరి శ్వాస వీడేదాకా జైపూర్ కోసం ఎంతగానో చేసిన వీరమహిళా. అలాంటి జైపూర్ మహారాణి గాయత్రీ దేవి గారి జీవిత చరిత్రని బయోపిక్ గా తీయాలన్న పూజ హెగ్డే ఆశని అభిమానులు మరియు గాయత్రీ దేవి గారు ఫాలోయర్స్ చాల ఆనందంగా ఉన్నారు. వారి ఆనందాన్ని సోషల్ మీడియా లో వ్యక్తం చేస్తున్నారు.
పూజ హెగ్డే తన కోరిక మాత్రమే బయటపెట్టింది , ఇంకా ఈ జైపూర్ మహారాణి గాయత్రీ దేవి గారి బయోపిక్ ఎపుడు మొదలవుతుంది అనే విషయం పై ఎటువంటి క్లారిటీ లేదు.
బహుశా సరైన దర్శకుడు మరియు నిర్మాత ఈ బయోపిక్ తో పూజ ని సంప్రదిస్తే త్వరగా షూటింగ్ మొదలుపెట్టచ్చు. చూడాలి మరి పూజ హెగ్డే తో జైపూర్ మహారాణి గాయత్రీ దేవి గారి బయోపిక్ ని ఎవరు దర్శకత్వం వహించబోతున్నారో.