Today Telugu News Updates

ఉత్కంఠగా మారిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు, polls for American President

అమెరికా కీలక రాష్ట్రాల్లో polls for American President డెమొక్రాట్ , రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుం డటంతో అమెరికా ఎన్నికల ఘట్టం అనిశ్చితిలోకి అడుగుపెట్టింది . చివరి నివేదిక ప్రకారం బైడెన్ 224 ఎన్నికల గణాలను ( ఎలెక్టోరల్ కాలేజి ) గెలుచుకున్నారు . 213 స్థానాలను గెలుచుకొని అధ్యక్షుడు ట్రంప్ ఆయనకు అతి చేరువలో ఉన్నా రు . ట్రంప్ మరో 70 ఎన్నికల గణాల్లో ఆధిక్యం లో ఉండగా , బైడెన్ కేవలం 23 గణాల్లో ముందం జలో ఉన్నారు . మొత్తం 538 ఎన్నికల గణాలున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన మెజారిటీ 270 గణాలు .

న్యూజెర్సీ , న్యూ యార్క్ రాష్ట్రాల్లో హోరా హోరీగా సాగిన పోరులో బైడెన్ గెలుపొందారు . కానీ కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో కొనసాగుతున్నారు . డెమొక్రాట్లకు అనుకూలమైన కొల రాడో , కనెక్టికట్ , డెలావేర్ , ఇలినాయిస్ , మసాచు సెట్స్ , న్యూ యార్క్ , న్యూ మెక్సికో , వెర్మాంట్ , వర్జీనియా రాష్ట్రాలను బైడెన్ గెలుచుకున్నారు . అలబామా , అర్కన్సాస్ , కెంటకీ , లూసియానా , మిసిసిప్పీ , నెజాస్కా , నార్త్ డకోటా , ఓక్లహామా , సౌత్ డకోటా , టెన్నెస్సీ , వెస్ట్ వర్జీనియా , వ్యో మింగ్ , ఇండియానా , సౌత్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు . కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఈ అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు స్థాయి లో పదికోట్లకు పైగా ఓటర్లు తమ హక్కును విని యోగించుకున్నారు . ప్రసిద్ధ ఫైవ్ థర్టీ డాట్ కామ్ కు చెందిన నేట్ సిల్వర్ ముందు బైడెన్ భారీ ఆధిక్యంతో గెలుస్తారని ప్రకటించారు . అయితే తర్వాత ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు . అయిన ప్పాటికీ బైడెన్ విజయానికి ఇంకా దారులు మూసుకుపో లేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు .

polls for American President ::

బోసిపోయిన టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రెండు పార్టీల మద్దతుదారులు , సాధారణ ప్రజలు , ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో 2016 ఎన్నికల నాటి రాత్రి సందడిగా కనిపించిన న్యూ యార్క్ లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ ప్రాంతం , ఈ సారి కరోనా కార ణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో దాదా పుగా నిర్మానుష్యమైపోయింది . కొంతమంది మాత్రమే మాస్కులు ధరించి ఫలితాలను ప్రదర్శిస్తున్న తెరలను చూస్తూ ఉండిపోయారు . ఇక ఎన్నికల రాత్రి అశాంతి నెలకొనవచ్చు , హింస తలెత్తవచ్చన్న ముందు జాగ్రత్త చర్యలు , భయాల వల్ల ఈ ప్రాంతంలోని చాలా వ్యాపా ర సముదాయాలు మూసివేశారు . కేవలం కొన్ని మాత్రమే తెరిచిపెట్టారు .

ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం మనదే : బైడెన్ “ విశ్వాసం ఉంచండి . మనం ఈ ఎన్నికల్లో గెలవబో తున్నాం ” అని డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి 77 ఏళ్ల బైడెన్ తన స్వస్థలం డెలావేర్ లో అన్నారు . ఇప్పటివ రకు బైడెన్ 224 ఎన్నికల గణాలను గెలుచుకోగా , ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ 213 గణాలతో వెనకబడి ఉన్నారు . ఆయన ఇంకా “ మనం చాలా దూరం వెళ్లా లని తెలుసు . అయితే మనం రేపు ఉదయం వరకు వేచి చూడటం అనేది సుదీర్ఘ సమయం అన్నది ఎవరికి తెలుసు . కానీ చూడండి మనం ఇప్పుడున్న దగ్గర మంచిగానే ఉన్నాం . మనం నిజంగానే గెలుస్తాం . ఈ రాత్రికి ఎన్నికలలో గెలవడానికి సరైన మార్గంలోనే ఉన్నామని మనం విశ్వసిద్దాం ” అని బైడెన్ అన్నారు .

కాలిఫోర్నియా , న్యూ యార్క్ , న్యూ జెర్సీ , మసాచు సెట్స్ , వాషింగ్టన్ , మేరీలాండ్ లాంటి డెమొక్రాట్ల సంప్రదాయ కంచుకోటలు బైడెన్ కైవసం అయ్యాయి . అయితే రిపబ్లికన్ల కంచుకోట అయిన అరిజోనా కూడా బైడెన్ ఖాతాలోకి చేరే అవకాశం ఉండటం గమ నించాల్సిన విషయం . తాజా వార్తల ప్రకారం ఒపీని యన్ పోల్స్ అంచనాలకు భిన్నంగా పెన్సిల్వేనియా , విస్కాన్సిన్ రాష్ట్రాల్లో బైడెన్ వెనకపడ్డారు . ఇక ఫ్లోరిడా , జార్జియా , ఓహియో రాష్ట్రాల్లో బైడెన్ ఓటమి పాలయ్యారు . అయితే “ ఈ – మెయిల్ ఓట్ల లెక్కింపు ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది . ప్రతి బ్యాలెట్ ను లెక్కించే వరకు పూర్తయినట్లు కాదు . ప్రతీ ఓటుకూ లెక్క ఉంటుంది ” అని బైడెన్ పేర్కొన్నారు . అరిజోనాను తప్పకుండా గెలుస్తాం . ఇప్పడే మిన్నెసోటా కూడా గెలిచాం . జార్జి యాలో ఇంకా బరిలోనే ఉన్నాం . విస్కాన్సిన్ , మిషిగ లో కూడా మనం మంచి స్థితిలోనే ఉన్నాం . ఓట్లు లెక్కించేందుకు ఇంకా సమయం పడుతుంది … కానీ పెన్సిల్వేనియాలో కూడా మనం గెలవబోతున్నాం ” అని ఆయన అన్నారు . “ విజేతను నిర్ణయించేది నేనో లేదా ట్రంపో కాదు . అది అమెరికా ప్రజల నిర్ణయం ” అని బైడెన్ పేర్కొన్నారు .

‘ పెద్ద మోసం ‘ జరగబోతోంది : ట్రంప్ కీలక రాష్ట్రాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు సాగుతుండగానే అమెరికా ప్రజలకు ‘ పెద్ద మోసం ‘ జరగబోతోంది . ఎన్నికల విషయంలో తాను సుప్రీంకోర్టులో పోరాడతా నని బుధవారం నాడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రక టించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button