Tollywood news in telugu

Vakeel Saab Movie: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి , వకీల్ సాబ్ టీమ్ కి షాకిచ్చిన పోలీసులు…!

vakeel saab pre release event pass

vakeel saab pre release event pass : పవన్ ఫాన్స్ కు నిరాశ కలిగించిన పోలీసులు… 3 సంవత్సరాల తరువాత పవన్ సినిమా ‘వకీల్ సబ్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతోంది. ఈ సందర్బంగా వకీల్ సాబ్  చిత్ర యూనిట్ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను   యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్‌లోని స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌లో ఏప్రిల్‌ 3వ తేదీన పవన్ అభిమానుల కోసం  నిర్వహించడానికి రెడీ అవుతుంది. కానీ పవన్ అభిమానులకు, చిత్ర యూనిట్ కి పోలీసులు షాక్ ఇచ్చారు.

అభిమానుల కోసం వకీల్‌సాబ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ని నిర్వహించడానికి , పర్మిషన్ ఇవ్వండి అని  జె.మీడియా ఫ్యాక్టరీ పోలీసులకు ఒక లేక ద్వారా కోరింది. కానీ ‌ ఈవెంట్‌కు జూబ్లీహిల్స్‌ పోలీసులు పర్మిషన్ ను ఇవ్వడానికి నిరాకరించింది. ప్రస్తుత తరుణంలో  మళ్ళీ కరోనా వైరస్ కేసులు భారీగా సంఖ్యలో నమోదు కావడంతో జీవో ప్రకారం రాష్ట్రంలో ఇక్కడకూడా  ఎటువంటి మీటింగ్‌లు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌  తెలిపారు.

కాబట్టి జీవో ప్రకారం వకీల్ సాబ్ ఈవెంట్ కి ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు తేల్చేసారు. కానీ ఇప్పటికే ఈ ఈవెంట్ కు దాదాపుగా 5 వేయిలకు పైగా జనం వస్తారనే అంచనాతో , పెద్దమొత్తంలో టికెట్స్ అమ్మడం , అలాగే ఈవెంట్ కోసమని ఈవెంట్ మేనేజర్స్ కి అడ్వాన్స్ లు ఇవ్వడం జరిగిందని, చిత్ర యూనిట్ పోలీసులకు లేఖలో తెలిపింది. ఐనప్పటికీ పోలీసులు మాత్రం ప్రజలు గుమికూడే పరిస్థితులు లేవని చిత్ర యూనిట్ కు తెలిపినట్టు సమాచారం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button