Today Telugu News Updates
స్పా సెంటర్ పేరుతొ… సే… రాకెట్ నడుపుతున్న వైనం… చెక్ పెట్టిన పోలీసులు !

హైదరాబాద్: రాజధాని అడ్డాగా చేసుకొని సే .. రాకేటర్లు రెచ్చిపోతున్నారు. స్పా సెంటర్ పేరుతో వారి దందాను దర్జాగా నడుపుకుంటున్నారు. ఇలాంటివి హైదరాబాద్ లో ఒక్కొకటిగా బయటపడుతుండడం వల్ల ఇంకా ఇలాంటివి ఎన్నున్నాయో అని పోలీసులు ఆరా తెస్తున్నారు.
హైదరాబాద్ లోని SR నగర్ లో ‘స్టార్ ఫ్యామిలి సెలూన్ ‘ పేరుతొ కొన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతుంది. కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ సెలూన్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ సెలూన్ నిర్వాహకుడిని , అందులో పనిచేసే ఇద్దరు అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.