Police Case Filed on Mani Ratnam : మణిరత్నం పై పోలీస్ కేసు :-

Mani Ratnam Case : మణిరత్నం పేరు కి ఇంట్రడక్షన్ అవలసరం లేదు. ఆయనేంటో అయన స్థాయి ఏంటో ఎన్ని తరాలుమారిన చెరగని పేరు అది. ఇటీవలే అయన నిర్మాతగా నవరస సిరీస్ తీసి ఘానా విజయం సాధించారు. ఇదిలా ఉండగా అయన పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ అఫ్ ఏనిమాల్స్ (PETA) ఇండియా.
కేసు పెట్టడం పై క్లారిటీ కూడా ఇచ్చారు. అదేంటంటే మణిరత్నం ప్రస్తుతం హిస్టారికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా తీస్తున్నారని దాని పేరు పొన్నియిన్ సెల్వన్ అని అందరికి తెలుసు. అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నా సమయంలో గుర్రం చనిపోవడంతో కేసు ఫైల్ అయింది.
హిస్టారికల్ సినిమాలు అంటే గుర్రం కచ్చితంగా ఉండాల్సిందే. అయితే సినిమా షూటింగ్ సమయం లో గుర్రం చనిపోయడం తో అబ్దుల్లాపురమేట్ పోలీస్ కేసు నమోదు చేశారు. దీనిపై మరింత విచారణ కోసం ఏనిమల్ వెల్ఫేర్ బోర్డు అఫ్ ఇండియా వారిని కూడా సంప్రదించడం జరిగింది.
అయితే విచారణలో తేలింది ఏమనగా పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ సమయం లో గుర్రానికి అస్సలు ఆహరం పెట్టలేదని, ఎండలో విశ్రాంతిలేకుండా షూటింగ్ లోనే గుర్రం ఉండడం డి-హైడ్రేట్ అయి చనిపోయింది అని తేలింది.
దీనితో పాటు PETA ఏనిమల్ బోర్డు వెల్ఫేర్ అఫ్ ఇండియా కి ఆదేశాలు, సూచనలు తెలిపారు. అందరికి సినిమా షూటింగ్స్ లో నిజమైన ఏనిమల్స్ ని వాడకుండా కంప్యూటర్ టెక్నాలజీ ని ఉపయోగించి చేయాలనీ ఆదేశాలు జారీ చేయండి అని చెపింది.
షూటింగ్స్ కోసం అని మూగజీవాల ప్రాణాలు బలవుతున్నాయి అని చెప్పారు. ఇపుడు మణిరత్నం పైన కేసు నమోదయింది. ఏనిమాల్ యాక్ట్స్ ప్రకారం వీరికి ఎటువంటి శిక్ష పడబోతుందో మరియు జరిమానా ఎంతో కోర్ట్ తీర్పు ఇచ్చేంతవరకు వేచి చూడాలి.