Today Telugu News Updates

మళ్లీ విష వాయువు లీక్,ఇద్దరు మృతి, Poisonous gas leaked in AP

ఇటీవల విశాఖ జిల్లాలో కలకలం రేపిన ఎల్‌ జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది . Poisonous gas leaked in AP   జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సాయినార్ లైఫ్ సైన్సస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సోమ వారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదం లో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన చోటు చేసుకుంది .

 వివరాల్లోకి వెళ్ళగా గుంటూరు తెనాలి సిటీకి చెందిన ఆర్ . నరేంద్ర ( 31 ) ఈయన ఉద్యోగరీత్యా అగనంపూడిలో నివాసం ఉంటున్నాడు అయితే ఈయన సాయినార్ పరిశ్రమ షిఫ్ట్ ఇంచార్జ్ గా విధులు నిర్వహిస్తున్నారు . అలాగే విజయనగరం జిల్లా పూసపాటి కి చెందిన గౌరీశంకర్ ( 26 )  పని చేస్తున్నారు . వీరు రోజు మాదిరి గానే రాత్రి వీధుల్లోకి వెళ్ళిన నలుగురు    రియాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తుండగా రియాక్టర్ నుండి అతి ప్రమాదక రమైన హైడ్రాక్సీ సర్ట్సైడ్ అనే రసాయన వాయువు ఒకసారి అధిక మోతాదులో లీక్ అవడంతో శ్వాస ఆడక పోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు .

Poisonous gas leaked in AP ::

 అయితే వీరితో పాటు ఉన్న పాలపువానిపాలెంకు చెందిన ఎల్పీ చంద్రశేఖం ( 37 ) అనకాపల్లి చెందిన పి ఆనందబాబు ( 41 ) అగనంపూడి చెందిన ఎస్ . సూర్యనారయణ ( 29 ) లు పరిశ్రమలో హెల్పెర్స్ గా విధులు నిర్వహిస్తున్నారు . డీ.జానకి రావు ( 29 ) అమిస్ట్రీగా విధులు నిర్వహిస్తున్నారు . అయితే మృతి చెందిన వారితో వీరు కూడా ప్రమాదంలో చిక్కుకుపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . వీరిని గాజువాకలో అర్వేదిక్ ఆస్పత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు . అదే విధంగా మృతి చెందిన మృతదేహాలు నగరంలోని కేజీ హెచ్ కు తరలించారు .

 ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు , పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ , జిల్లా కలెక్టర్ వినయ్ చండ్ , నగర సిపి ఆర్కే మీనా  సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలపై ఆరా తీశారు . ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ అర్ధరాత్రి ప్రాంతంలో జరిగిన సంఘటన చాలా దుర దృష్టకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం మృతిచెందిన కుటుంబాలను ఆదు కుంటామని తీవ్ర అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం చేస్తామని అన్నారు . అంతేకాకుండా ప్రమాదం జరిగిన తీరు పరిశీలించడానికి నలుగురు అధికారులు తో కూడిన కమిటీ వేయడం జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button