Pogaru Movie Review : మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘పొగరు’..!

డైరెక్టర్ : నందన్‌కిషోర్
ప్రొడ్యూసర్ : ప్రతాప్‌రాజు
సంగీతం : చందన్‌శెట్టి
నటినటులు : రష్మిక మందన్న, ధృవ సర్జా అలాగే వీరితో పాటుగా సాధు కోకిలా, కుట్టి ప్రతాప్, నంజయ్, పి రవిశంకర్, కై గ్రీన్, మోర్గాన్ ఆస్టే , రాఘవేంద్ర రాజ్‌కుమార్, ముఖ్య పత్రాలు పోషించారు.

ఈ సినిమాలో జంటగా ధృవ సర్జా, రష్మిక మందన్న నటించారు. ఇది ఒక కన్నడ చిత్రం తెలుగులో ‘పొగరు’ అనే పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్ని సాయిసూర్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి. ప్రతాప్‌రాజు తెలుగులో విడుదల చేసారు. నందన్‌కిషోర్ ఈ సినిమాకు దర్శకుడు కాగా సంగీతం చందన్ శెట్టి అందించారు.
ఈ మూవీ ‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్’ గా రూపొందించారు. సినిమా విడుదలకు ముందు ఇందులోని ‘కరాబు మైండు కరాబు..’ అనే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. యూట్యూబ్ లోఈ పాటకు మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కాయి. ఈ రోజు ఫిబ్రవరి 19(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకువచ్చింది.
ఇకఈ సినిమా రివ్యూ ఎలా ఉందొ తెలుసుకుందాం ..

ఇందులో ధృవ సర్జా సామాన్యులను ఇబ్బంది పెట్టే రౌడీలతో పోరాడే వ్యక్తి పాత్ర లో కనిపించాడు. ఇందులో హీరో దృవ లుక్ ఉరమాస్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. ఈ సినిమా కోసమని ధ్రువ ఏకంగా 30 kg ల బరువు తగ్గాడు . ఎందుకంటే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ లో ధృవ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించడం కోసమట.
రూ .25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో పాటు… మాస్ లుక్స్, డైలాగ్ డెలివరీలతో థియేటర్ ను దడదడలాడించాడు.

సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ చాల బాగుంది. అదేవిదంగా ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా చూసినవారు కూడా ఇంతటి ఊర మాస్ ని ఎక్కడ ఇంతవరకు చూడలేదు అని అంటున్నారు. తన డాన్స్, యాక్షన్ తో సినిమాను సింగిల్ హ్యాండ్ తో దున్నేసాడు. ఇది ఎక్కువగా మాస్ ఆడియన్స్ ని ఆకర్షింస్తుంది. అలాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుందని ప్రేక్షకులు షోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.