Plastic Rice Crisis: మళ్ళీ తెరపైకి వచ్చిన ప్లాస్టిక్ బియ్యం బాగోతం…ఎక్కడంటే.. !

Plastic Rice Crisis: కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండల పరిధి , గుండి గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం లభ్యమయ్యాయి. ఇవి ఒక పూలాజి బాబా అనే ఆశ్రమం వద్ద అన్నదాన జరిగే కార్యక్రమంలో ప్లాస్టిక్ బియ్యం కాలకలంరేపాయి. వండిన అన్నం మాడిన వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ బియ్యాన్ని, అదేవిదంగా అన్నాన్ని చూసి స్థానికులు ప్లాస్టిక్ బియ్యంగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ అప్పటికే కొంతమంది అన్నం తినడంతో వారు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ప్లాస్టిక్ రైస్‌ను తిన్న వారు ఎలాంటి సమస్యలు వస్తాయో అని బయాందోనళకు గురిఅవుతున్నారు.
అయితే ఇలాంటి సంఘటనలు ఇప్పుడేమి కొత్తకాదు. వీటికి చైనా రైస్ అని పేరుకూడా ఉంది. ఇలాంటి చైనా రైస్ ని అమ్ముతున్నవారిని, సప్లై చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందంతా అలా ఉంటె… ఇవి నిజంగా ప్లాస్టిక్ రైసేనా.. ఎంత వరకు ఇది నిజం అనేదానిపై అధికారులు అనేక సార్లు పరీక్షించారు.
ఇప్పటివరకు ఎక్కడకూడ ప్లాస్టిక్ రైస్ బయటపడలేదు. అధికారులు పాడైపోయిన బియ్యాన్ని పాలిషింగ్ చేసి అమ్ముతున్నారని గుర్తించారు . తాజాగా కొమరంభీం జిల్లాలోనే మరోమారు ఇలాంటి బియ్యం బయటపడడం చర్చనీయాంశంగా మారింది. ఈ జిల్లాకు సరఫరా అవుతున్న బియ్యం ఎక్కడి నుండి వస్తున్నాయో..తెలపాలని అదేవిదంగా నల్లబడడానికి గల కారణం వెతకాలని స్థానికులు డిమాండ్ చేస్తూ.. తగిన పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.