మెగాస్టార్ చిరు కోసం అన్నీ అమ్ముకుని రోడ్డుపై పడ్డ అభిమాని !

మహబూబాద్ కి చెందిన బాలాజీ అనే వ్యక్తి మెగాస్టార్ కి వీరాభిమాని, చిరు సినిమా వచ్చిందంటే చిరు కటౌట్లకు, పాలాభిషేకాలు , బ్యాండ్ లకు ఇక చిరు బర్త్ డే వస్తే ఆ పార్టీకి తన సొంతడబ్బులు ఖర్చు పెట్టి మరి తన అభిమానాన్ని చూపించేవాడు.
ఇలాచేసే అభిమానులు చాలావున్నారు కానీ బాలాజీకి ఉన్న 3 ఎకరాల పొలాన్ని కూడా కోసం అమ్మేశాడు . చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో రక్తదానం చేయించేందుకు ఏకంగా 150 మందిని తన ఊరి నుండి తీసుకొచ్చాడు.
చిరు వందరోజుల ఫంక్షన్ ని కూడా తన సొంత ఖర్చులతో చేసే వాడు. ఇలా తన అభిమానాన్ని మెగాస్టార్ పై చూపి తనకి ఏమి లేకుండా చేసుకుని చివరకు రోడ్డున పడే పరిస్థితి కి వచ్చాడు.
ఈ అభిమాని చిరు ని కలవడానికి ఎన్నిసార్లు వచ్చిన చిరు సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకోవడంతో మీడియాను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నారు.
ఈ బాలాజీకి చిరు ఎలాంటి సహాయాన్ని అందిస్తాడో చూడాలి మరి .