telugu facts

టౌన్ షిప్ లో ఫ్లాట్స్ లేదా ఇల్లు కొనాలి అనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసం

జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక మరపురాని కల ఉంటుంది. అదే తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని. కాని ఈ కల తీరడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇల్లు కొనడం అనేది పెద్ద మొత్తంలో డబ్బు అవసరంతో కూడుకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి ఆర్ధిక స్తోమతని దృష్టిలో ఉంచుకొని  తమ బడ్జెట్ కి సరిపోయే ప్రాపర్టీని ఎంచుకోవాలి. ఇప్పుడు నగరాలు, చిన్న చిన్న టౌన్స్ లలో కూడా ఎక్కువగా ఫ్లాట్స్ కి డిమాండ్ ఉంటుంది. అపార్ట్ మెంట్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇల్లు కొనాలి అనుకునేవారిలో చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అవి ఇండిపెండెంట్ హౌస్ కొనాలా లేదా ఫ్లాట్ కొనాలా అనేది ఒక ముఖ్యమైన సమస్య. మనం ఎంతో కష్టపడి డబ్బులు పొదుపు చేసుకొని తీసుకొనే  సొంత ఇల్లు మనకు అన్ని రకాలుగా సంతృప్తిని ఇవ్వాలి. భవిష్యత్తులో మనం దానిని అమ్మాలి అనుకున్నప్పుడు మార్కెట్ పరంగా మంచి అమౌంట్ కూడా కలిగి ఉండాలి. మనo తీసుకొనే ఇల్లు మనకు కావలసిన అన్ని సౌకర్యాలకు దగ్గరగా ఉండేలా కూడా చూసుకోవాలి. ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. భద్రత పరంగా కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అంత సేఫ్ కాదనే చెప్పాలి. ఇవన్నీ దృష్టిలో తీసుకొని చూసినట్లయితే టౌన్ షిప్/గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ లేదా విల్లా తీసుకోవడం మంచిది. అది ఎలానో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు వస్తున్నGated communities or Townships లో అన్ని మౌలిక సదుపాయాలూ అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా స్కూల్స్, హాస్పిటల్స్, పార్క్, జిమ్, షాపింగ్ మాల్స్, మెడికల్ షాప్స్ అన్ని అందుబాటులో ఉండేలా ఈ టౌన్ షిప్స్ ని నిర్మిస్తున్నారు. మనకు కావలసిన అన్ని సదుపాయాలూ ఒకే చోట ఉండడంవల్ల మనకు టైం కూడా సేవ్ అవుతుంది. కాబట్టి నేడు ఎక్కువ ఫ్లాట్స్ తీసుకోవడానికే ఇష్టపడుతున్నారు.

సెక్యూరిటీ పరంగా:

సిటీస్ లో ఈ మధ్య ఎక్కడ చూసినా నేరాలు, దొంగతనాలు ఎక్కువగా చోటు చేసుకుoటున్నాయి. కాబట్టి సెక్యూరిటీ పరంగా చూసుకున్నా Gated communities or Townships లో ఇల్లు కొనుగోలు చేసుకోవడం మంచిది. సెక్యూరిటీ సిబ్బంది, వాచ్ మెన్స్, టౌన్ షి లోకి ప్రవేశిoచే ప్రతి ఒక్కరి దగ్గర వివరాలు సేకరించిన తరువాతే వారిని లోపలి అముమతిస్తారు. అనుమానాస్పద వ్యక్తులు లోపలికి ప్రవేశిoచే ఆస్కారం చాలా తక్కువ.  దీనితో ఎటువంటి నేరాలు జరిగే అవకాశం ఉండదు. భార్యా, భర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇంటితోపాటు, ఇంట్లో చిన్నారులు ఉన్నా,  వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నా వారికి రక్షణ ఉంటుంది. సీసీ కెమెరాలతో పరిసరాలపై నిఘా కూడా ఉంటుంది.

మంచి వసతులు:

Gated communities or Townships లో జిమ్, ప్లే గ్రౌండ్, పార్క్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్ వంటి వసతులు కూడా ఉంటాయి. పెద్దవారు తీరిక సమయాల్లో నడిచేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్, గార్డెన్, ఉంటాయి. ఉదయాన్నే వ్యాయాయం చేసుకోవడానికి, సేద తీరడానికి, చిన్నారులు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. రిలాక్స్ కావాలి అనుకున్నపుడు స్విమ్మింగ్, స్పోర్ట్స్ వంటి వాటితో కాలక్షేపం చెయ్యవచ్చు. ఇంటిలో ఏదైనా ఎలక్ట్రికల్ పరంగా, వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ఎలెక్ట్రిషియన్, ప్లంబర్ అందుబాటులో ఉంటారు.

పోల్యుషన్ కి దూరంగా:

సాధారణంగా Gated communities or Townships వంటి ప్రాజెక్టులు సిటీలోనే ట్రాఫిక్, కాలుష్యం తక్కువ ఉండే ప్రాంతాల్లోనే నిర్మిస్తుoటారు. ప్రాజెక్టు లోపల చెట్లు, మొక్కలతో తగినంత పచ్చదనం కూడా ఉంటుంది. కనుక చక్కటి గాలి, వెలుతురూ కూడా లభిస్తాయి. ఆరోగ్యానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

పెట్టుబడి పరంగా:

మనం కొనే ఇల్లు మనకు భవిష్యత్తులో ఎప్పుడైనా దానిని అమ్మవలసినపుడు టౌన్ షిప్స్ లో ఉండే అన్ని సౌకర్యాలు, అనుకూలతల దృష్ట్యా త్వరగా అమ్ముడుపోగలదు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button