Tollywood news in telugu

Pitta Katha Movie Review: పిట్టకథలు రివ్యూ .. నాలుగు పిట్టలు ఎలాచేసాయంటే..!

టాలీవుడ్‌లో వచ్చే ఎంతమంచి  సినిమా అయినా ప్రచారమనేది లేకుంటే ఆ సినిమాకు పెట్టిన ఖర్చుకూడా రాని పరిస్థితి ఉంటుంది.  చిన్న సినిమా అయినటువంటి ‘ఓ పిట్టకథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి  రావడంతో , అదేవిదంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ట్వీట్ చేయడం ద్వారా ఈ సినిమాకి ప్రత్యేకించి వేరేవిధమైన  ప్రకటనలు అవసరం లేకుండానే ప్రజలవద్దకు ఈ ‘ఓ పిట్టకథ’ అనే పేరు వెళ్ళింది. 

Pitta Katha Movie Review

కథ విషయానికి వస్తే…

ఇందులో   సినిమా థియేటర్ యజమాని ‘వీర్రాజు’కు ఒక కూతురు తన పేరు వెంకటలక్ష్మి (నిత్యాశెట్టి)ని ఎంతో గారాబంగా  పెంచుతాడు. వెంకటలక్ష్మి కి తల్లిలేకపోవడంతో గారాబం కాస్త ఎక్కువచేసాడనే చెప్పాలి. ఇక  వీర్రాజు థియేటర్‌లో పనిచేసే ప్రభు (సంజయ్ రావు), వెంకటలక్ష్మి ఇద్దరు ప్రేమలో పాడుతారు.  ఈ విషయం వీర్రాజుకు తెలీదు. ఈ సందర్భం లోనే  అనుకోకుండా  చైనా నుంచి వీర్రాజు చెల్లెలి కొడుకు క్రిష్ (విశ్వంత్) ఫ్లయిట్ దిగి ఊళ్లోకి వస్తాడు. క్రిష్ కి మరదలైన వెంకటలక్ష్మి ని  పెళ్లిచేసుకుంటానని మేనమా వీర్రాజు ను  ఒప్పిస్తాడు. ఈ  విషయం తెలుసుకున్న వెంకటలక్ష్మి  కనిపించకుండా పోతుంది. అసలు వెంకటలక్ష్మి ఏమైంది? ప్రభు తో వెళ్లిందా లేదా ఇంకేటయినా వెళ్లిందా .. ? ఈ సినిమాలో చివరికి వీర్రాజు ఎవరికీ ఇచ్చి పెళ్ళిచేస్తాడు.. ప్రభు ను ఏంచేస్తాడు ..  స్టోరీ ఎలా ముగిసింది? అనే కథాంశం పై ఈ సినిమా సాగుతుంది.

రివ్యూ

దర్శకుడు ‘చెందు ‘ తీసుకున్న స్టోరీ లైన్ చిన్నదే అయినా దాన్ని స్క్రీన్‌ప్లే‌తో బాగా చూపించారు. ఈ సినిమాలో చెప్పాలంటే  సెకండాఫ్ కి బలమని చెప్పొచ్చు.  ఫస్టాఫ్ సినిమాను సాగదీసినట్టు ఉంటుంది. మధ్యమధ్యలో కామెడీ జత చేసినా అది సరిగ్గా పండలేదు.  థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్ మూవీ.  సినిమా క్లైమాక్స్‌కు వచ్చేంత వరకు ఎవరు విలన్, ఎవరు హీరో అనే పాయింట్‌ను ప్రేక్షకుడు పట్టుకోలేడు. అంత బాగా లాక్కొచ్చారు దర్శకుడు. కథ బాగున్నప్పటికీ  నెమ్మదిగా సాగుతుంది.  కానీ, ఇంటర్వెల్ నుంచి సినిమా మాత్రం చాల ట్విస్టులతో కూడి ఉంటుంది. ఈ  ట్విస్టులు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. చైనా నుండి వచ్చిన క్రిష్ ఎత్తులకు ప్రభు వేసే పైఎత్తులు చూసే వారికీ మంచి థ్రిల్‌ను కలిగిస్తాయి. ఈ సెకండ్ ఆఫ్ బాగుందనే ఫీలింగ్ తో ప్రజలు థియేటర్‌ నుంచి బయటికి వెళ్తారు .

నటీనటుల విషయానికి వస్తే.. బ్రహ్మాజి కుమారుడు సంజయ్ రావు మాములుగా చేసాడు. సంజయ్ కి  తొలి సినిమానే అయినా కొన్ని సన్నివేశాల్లో బాగా చేసాడు.  విశ్వంత్ తన పాత్రకు మంచి న్యాయమే చేశారు.  ఇక హీరోయిన్ నిత్యాశెట్టి క్యూట్ లుక్స్ తో మరియు యాక్టింగ్‌తో ఆకట్టుకుంది.  కూతురుగా, ప్రేయసిగా, బావకు మరదలిగా ప్రేక్షకులను మెప్పించింది.  పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా

బ్రహ్మాజి ఇరగదీసాడు. ఇలాంటి పాత్రలు చేయడం తనకి కొత్తేమీకాదు. మిగితా  నటీనటులంతా తమ పాత్రల లకు తగ్గట్టు చేసారు.

టెక్నికల్‌గా..

ఈ సినిమా టెక్నికల్‌గా థ్రిల్లర్ సినిమాలకు పనిచేసే కెమెరా జిమ్మిక్కులను అన్నింటిని ఈ సినిమాలో వాడారు. సినిమా లుక్  చాలా రిచ్‌గా ఉంది. ముఖ్యంగా సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ తో ఆకట్టుకున్నాడు.   అరకు పేరుతో చూపించిన ఊటీ అందాలను తెరపై అద్భుతంగా కనపడేలా చేసారు. ఆదేవిందంగా పల్లె అందాలను, కూడా చాల అద్భుతంగా చూపించారు. డ్రోన్ షాట్లు చాలా బాగున్నాయి. ఇక ప్రవీణ్ లక్కరాజు  సంగీతం మరో మ్యాజిక్ అని చెప్పాలి.  అలాగే, ఆయన స్వరపరిచిన రెండు పాటలు అందరిని ఆకట్టుకున్నాయి.

చివరిగా..

‘ఓ పిట్టకథ’ ట్విస్టులతో కూడిన ఒక మంచి సినిమా అలాగే  ఒక మంచి రొమాంటిక్ థ్రిల్లర్ కూడానూ…

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button