health tips in telugu

పిస్తా పప్పులతో మీ హార్ట్ ని హెల్తీ గా ఉంచుకోండి

మంచి విషయాలు ఎప్పుడు చిన్న ప్యాకేజస్ లలోనే వస్తాయి. ఇది నట్స్ కి కూడా వర్తిస్తుంది. వీటినే డ్రై ఫ్రూట్స్ అని కూడా అంటారు. అంతే కాకుండా ఈ చిన్న సైజులో ఉండే క్రంచీ నట్స్ లో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాని డ్రై ఫ్రూట్స్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. వాటిలో ఒకటి అవి తింటే బరువు పెరుగుతారని, అసలు నిజం ఏమిటంటే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా బరువు తగ్గడానికి ఉపయోగించే ప్రధాన పదార్థాల్లో ఒకటి. వీటిలో పిస్తా పప్పులు ఒకటి. వీటి వలన మనకు కలిగే మంచి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఒక ఆరోగ్య అధ్యయనం ప్రకారం, 12 వారాలపాటు 25 గ్రాముల పిస్తాపప్పులను రోజువారీగా తినే వ్యక్తుల రక్తoలో గ్లూకోస్ లెవెల్స్ ని మెరుగుపరుస్తుంది మరియు రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్ మరియు సి-రియాక్టివ్ ప్రోటీన్, శరీరంలోని వీటన్నింటిని  కంట్రోల్ లో ఉంచుతుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నింటిని  పరిగణలోకి తీసుకుంటే, ఈ బలమైన ఆకుపచ్చ గింజలు ఇచ్చే హెల్త్ బెనిఫిట్స్ కొన్నింటిని తెలుసుకుందాం.

పుష్కలంగా యాంటీ-ఆక్సిడెంట్స్

వాల్ నట్స్ తరువాత మిగతా నట్స్ మరియు సీడ్స్ కంటే యాంటీ ఆక్సిడెంట్స్ పిస్తా పప్పులలో అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ సెల్స్ డామేజ్ అవకుండా మరియు కాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

హార్ట్ ఫ్రెండ్లీ

కేవలం 2 లేదా 4 పిస్తా పప్పులు గుండె ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. ఈ గింజలు ఫైటోస్టిరాల్స్ ను కలిగి ఉంటాయి, ఇవి వివిధ ఆహార పదార్ధాల నుండి కొలెస్ట్రాల్ ను పీల్చుకోవడాన్ని తగ్గించి మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుoది.

ఆరోగ్యవంతమైన కంటి చూపు

పిస్తాపప్పులు అధిక స్థాయిలో విటమిన్ E ని కలిగి ఉంటాయి, ఇది కంటి ఆరోగ్యాన్ని మరియు కంటి చూపును మెరుగుపరుచడానికి తోడ్పుతుంది. ఇది కణజాల క్షీణత మరియు కంటిశుక్లం నుండి కళ్ళను రక్షించే కెరోటినాయిడ్లను కలిగి ఉంటుంది.

అధిక బరువు తగ్గడం కోసం

ఈ గింజలు అధిక శక్తిని కలిగి ఉన్నప్పటికీ, అదనపు కిలోలను తగ్గిస్తాయి. ప్రోటీన్ తో పాటు మీ జీవక్రియను పెంచడంలో సహాయపడే ఫైబర్ అధికంగా ఉంటుంది.

గట్ బాక్టీరియా

జీర్ణవ్యవస్థను బలపరచడంలో సహాయపడే డైటరీ ఫైబర్ అధిక సంఖ్యలో ఉంటుంది. పిస్తాపప్పులు గట్ బాక్టీరియాకు మంచివి మరియు మంచి గట్ బ్యాక్టీరియాను పెంచడంలో కూడా సహాయపడతాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button