Tollywood news in telugu

పిచ్చోడు మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాడు,వెంటాడుతాడు. !!!

సమీక్ష : పిచ్చోడు
విడుదల తేదీ : నవంబర్ 22, 2019
రేటింగ్ : 3/5
నటీనటులు : క్రాంతి , కె . సిమర్ , పోసాని కృష్ణ మురళి , సత్య కృష్ణ , సమీర్ , అభయ్ , మహేష్ , అప్పారావు తదితరులు
నిర్మాత , దర్శకత్వం : హేమంత్ శ్రీనివాస్
సంగీతం : బంటి
సినిమాటోగ్రఫీ : గోపి అమితాబ్
ఎడిటర్ : సంతోష్ గడ్డం
ఈ మధ్యకాలంలో రిలీజ్ కు ముందే వినూత్న కథాంశంతో ఆలోచనలు రేకెత్తించిన చిత్రాల్లో ‘పిచ్చోడు ‘ఒకటి .”సోల్ మేట్ మూఢనమ్మకం కాదు సైన్స్ “అన్న ఈ చిత్ర ట్రైలర్లోని డైలాగ్ అందర్నీ ఆలోచనల్లో పడేసింది .హేమంత్ శ్రీనివాస్ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం మరి సోల్ మేట్ నిజమని ప్రూవ్ చేసిందా లేదా అంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే .

కథ :
చిన్నప్పుడే అమ్మని కోల్పోతాడు రిషి .తన అమ్మానాన్న సోల్ మేట్స్ కాకపోవడం వల్లనే అమ్మ ఆత్మహత్య చేస్కుని చనిపోయిందని తన నాన్నమ్మ చెప్పిన మాటలు తన మనసులో బలంగా ముద్రించుకు పోతాయి . వాళ్ళలా తన లైఫ్ కాకూడదని తన సోల్ మేట్ని వెతుక్కోవడమే తన లైఫ్ టార్గెట్ గా పెట్టుకుంటాడు రిషి. మరి రిషి తన సోల్ మేట్ ని వెతికి పెట్టుకున్నాడా,అసలు సోల్ మేట్ అనేవాళ్లు నిజంగా వుంటారా అనే విషయాలు తెలిసికోవాలంటే ఈ చిత్రం చూడల్సిందే.

విశ్లేషణ :ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింటుని ఎంచుకోవడంలోనే దర్శకుడు హేమంత్ శ్రీనివాస్ సగం సక్సెస్ అయ్యాడు . ఒక పరిణతి గల దర్శకుడి చిత్రంలా అనిపించే ఈ సినిమా ‘సోల్ మేట్ ‘అనే అంశంపై చాలా పరిశోధన చేసి తీసిన నిజాయితీ ప్రయత్నంలా అనిపిస్తుంది. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో ఇంత మంచి స్క్రీన్ ప్లే ఈ మధ్య కాలంలో రాలేదనే చెప్పొచ్చు. ఒక మంచి డైరెక్టర్ ఇండస్ట్రీకి దొరికాడనిపిస్తుంది. ఎడిటింగ్ బాగున్నప్పటికీ కొన్ని చోట్ల షాట్ కనెక్టివిటీ మిస్ అయ్యిందనిపిస్తుంది.కొన్ని చోట్ల పరిమిత వనరుల ఎఫెక్ట్ కనిపించింది. నటీనటులు కొత్తవారినప్పటికీ పాత్రకనుగునంగా చక్కగా నటించారు. వున్నవి రెండుపాటలైనా మనసుకి నచ్చుతాయి. “నువ్వే నువ్వే “పాట గుర్తుండి పోతుంది. ఫోటోగ్రఫీ కొన్ని చోట్ల తేలిపోయింది. డి ఐ ఇంకా బాగుండాల్సింది. రీ రికార్డింగ్ సినిమా స్థాయిని పెంచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. క్లైమాక్స్ గుర్తుండిపోతుంది.

తీర్పు :
‘సోల్ మేట్స్ ‘నిజమే అనిపించే విధంగా పరిశోధనాత్మక కథాంశంతో వచ్చిన ఈ చిత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా చూసాక మీరు మీ సోల్ మేట్ గురించి ఆలోచనలో పడతారు. “అందరు ఋషులు భక్తిలో ఋషులైతే ఈ ఋషి ప్రేమలో ఋషి అయ్యాడు “అన్న ఈ చిత్రపు డైలాగె ఈ చిత్ర లోతుని,హీరో తపనని చెప్తుంది. పరిణతి గల టీం నుండి వచ్చిన చిత్రంలా అనిపించే ఈ పిచ్చోడు మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాడు,వెంటాడుతాడు. తప్పక చూడాల్సిన చిత్రమిది. గో ఫర్ ఇట్.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button