Tollywood news in telugu
vakeel saab : ‘వకీల్ సాబ్’ సెట్ లో ఫోటోలు లీక్ … వైరల్ !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరో గా నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ సినిమా పింక్‌కు రీమేక్‌గా తెలుగులో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో చిత్రీకరిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పవన్ ని కలవడానికి భారీగా తరలి వచ్చారు. తన కోసం వచ్చిన కొందరితో సెల్ఫీలు దిగారు. దీంతో పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ సెట్ లోని కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. పవన్ మూడు సంవత్సరాల తర్వాత తిరిగి సినిమాల్లో చేస్తున్నారు .
ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా , శ్రుతిహాసన్ కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకి దిల్‌రాజ్ నిర్మాన బాధ్యతలు వహిస్తున్నారు.