కార్తీక దీపం వంటలక్క గురించి మీకు తెలియని పర్సనల్ విషయాలు !
కార్తీక దీపం స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంత పాపులరో మీకు తెలిసిన విషయమే, ఈ సీరియల్ లో వంటలక్కగా చేస్తున్న ప్రేమి విశ్వనాధ్ గురించి కొన్ని విషయాలు.

ప్రేమి విశ్వనాధ్ స్వంత ఊరు కేరళ, తను డిసెంబర్ 2, 1991వ సంవత్సరంలో విశ్వనాథ్, కాంచన విశ్వనాథ్ లకు జన్మించింది . ప్రేమికి ఒక అన్నయ్య ఉన్నారు పేరు శివ ప్రసాద్.

శివ ప్రసాద్ ఓ ఫోటోగ్రాఫర్. ఆయనకు ఎర్నాకుళంలో రెండు స్టూడియోలు ఉన్నాయి . ప్రీమికి కూడా ఫోటోగ్రఫీపై ఇంట్రెస్ట్ ఉండేది. ప్రేమి సీరియల్స్ లోకి రాకముందు ఎర్నాకుళంలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసింది.

ప్రేమి విశ్వనాధ్ భర్తపేరు డాక్టర్ టి ఎస్ వినీత్ భట్. ప్రస్తుతం తన భర్తతో కలిసి ఎర్నాకుళంలో నివసిస్తోంది.

నటనా విషయానికి వస్తే…… తెలుగులో 16 అక్టోబర్ 2017 న విడుదలైన కార్తిక దీపంతో ప్రేమి పాపులర్ అయ్యింది. ఈ సీరియల్ మలయాళంలో ‘కరుతముత్తు’ పేరుతో 2013 లో ప్రారంభమైంది.

ఈ సీరియల్‌లో ప్రేమి విశ్వనాథ్ నటించినందుకు ఉత్తమ మహిళా నటి (2014) ఆసియానెట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది.
