Chiranjeevi: ఆయను కొడితే జనాలు నన్ను కొడుతారు : చిరంజీవి
Chiranjeevi: ఆయను కొడితే జనాలు నన్ను కొడుతారు:చిరంజీవి :- సోను సూద్… ఈ పేరు విన్న వారు మొదట రీల్ విలన్ అనేవారు….కానీ ఇప్పుడు రియల్ హీరో అన్ని అంటున్నారు. కరోనా కష్ట కాలంలో ఎంతోమందికి సోను సూద్ అండగా నిలవడంతో.. ప్రజలు దేవుని గా భావిస్తున్నారు. కొందరైతే సోను సూద్ ఏకంగా గుడినే కట్టారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సోను సూద్ అంటే ప్రజలో ఎంత క్రేజ్ ఉందో అన్ని… అందుకే ఈయనకు విలన్ పాత్రలు ఇవ్వాలంటే దర్శక నిర్మాతలు భయపడుతున్నారు.

ప్రస్తుతం సోనూసూద్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న “అల్లుడు అదుర్స్” చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “ఆచార్య” చిత్రంలో ప్రతి నాయకుడు పాత్ర పోషిస్తున్నారు. ఈ మేరకు ఇటీవలే ఆచార్య షూటింగ్ మొదలైంది. ఆ షూటింగ్ పోరాట సన్నివేశాల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ప్రతినాయకుడైనా సోను సూద్ ను కొట్టే సన్నివేశాలను ఉండగా.. మెగాస్టార్ దానికి నిరాకరించాడు. సోను సూద్ ని కొడితే జనాలు నన్ను కొడతారని చిరంజీవి అంటూ దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ మార్చమని కోరారు. దీంతో కొరటాల శివ ఈ కథలో కొన్ని మార్పులు చేశారట. చిరంజీవి తన సినీ కెరీర్లో ఇప్పటివరకూ ఒక్కరి కోసం ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. మరి అలాంటి అగ్ర హీరో సోనూసూద్ కోసం వెనుకడుగు వేశారంటే సోను సూద్ పాపులారిటీ ఏంటో ఊహించుకోవచ్చు
