Pelli SandaD Movie Review – పెళ్లి సందడి

Cinema :- Pelli SandaD Movie Review (2021)
నటీనటులు :- రోషన్ శ్రీకాంత్ , శ్రీ లీలా , కె. రాఘవేంద్రరావు , రాజేంద్ర ప్రసాద్ , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , పోసాని కృష్ణ మురళి.
నిర్మాతలు :- శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని
సంగీత దర్శకుడు :- కీరవాణి. యమ్. యమ్
Director : – Gauri Ronanki.
Story ( Spoiler Free ) :-
ఈ కథ వశిష్ఠ (రాఘవేంద్ర రావు ) గారు పెద్ద బాస్కెట్ బాల్ ప్లేయర్ మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీత గా చూపిస్తూ మొదలవుతుంది. ఆలా ఆలా కాలం సాగుతుండగా వశిష్ఠ తన స్నేహితుడైన రాజేంద్ర ప్రసాద్ తో , తన లైఫ్ మొత్తం జరిగిన కథ గురించి వివరించడం తో ఈ సినిమా మైన్ ప్లాట్ లోకి ఎంటర్ అవుతుంది.
ఇపుడు ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ అంత వశిష్ఠ యవ్వనం లో జరిగిన ప్రేమ కథ. యవ్వనం లో వశిష్ఠ ( రోషన్ ) బంధువుల పెళ్ళి సమయం లో సహస్ర ( శ్రీ లీల ) ని చూసి ప్రేమలో పడుతాడు. ఆలా వీరిద్దరూ హ్యాపీ గా ప్రేమజీవితం గడుపుతుండగా ఈ విషయం తెలుసుకున్న సహస్ర నాన్న (ప్రకాష్ రాజ్ ) కి నచ్చకపోవడంతో వీరి ప్రేమని నిరాకరించి సహస్ర పెళ్ళి చింటూ ( వెన్నెల కిషోర్ ) తో ఫిక్స్ చేస్తాడు.
ఇపుడు వశిష్ఠ ఎం చేయబోతున్నాడు ? వశిష్ఠ మరియు సహస్ర కలిసి ప్రకాష్ రాజ్ ని ఒపించగలిగారా లేదా ? చివరికి ఎం జరగబోతుంది ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.
Positives👍 :-
- రోషన్ , శ్రీ లీలా చాల బాగా నటించారు. రాఘవేంద్ర రావు గారి స్క్రీన్ ప్రజన్స్ అలరిస్తుంది. మిగితా పాత్రధారులు కూడా వారివారి టైమింగ్ తో బానే చేసారు.
- సినిమా యొక నిడివి.
- సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ పర్వాలేదు.
- మ్యూజిక్ ఓకే.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
Negatives 👎 :-
- దర్శకత్వం సరిగ్గా తియలేకపోయారు.
- తెలిసిన కథే అయినా కథనం కొత్తగా రాసుకుని తీయాల్సింది.
- బోరింగ్ సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి.
Overall :-
మొత్తానికి పెళ్ళి సందడి అనే సినిమా చాల పాత చింతకాయ పచ్చడి లాంటి కథ తో వచ్చిన కధనం మీదైనా శ్రద్ధ పెట్టింటే ప్రేక్షకులని అలరించేది. రోషన్ , శ్రీ లీలా పెర్ఫార్మన్స్ బాగా చేశారు దానికితోడు మిగితా పాత్రధారుల నటన కూడా తోడవడం తో ప్రేక్షకులని కొంతమేరకు అలరిస్తుంది.
మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. కధనం సరిగా రాసుకోకపోవడంతో దర్శకురాలైన గౌరి రోనంకి గారు పెద్ద విఫలం అయ్యారు. రాఘవేంద్ర రావు గారి సుపర్ విజన్ కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బోరింగ్ సన్నివేశాలు ఎక్కువే ఉండటంతో ప్రేక్షకులని నిరాశ కలిగిస్తుంది.
మొత్తానికి ఈ సినిమా కొత్తతరం నటీనటులను ఆదరించేందుకు కోసం ఓసారి చూసేయచ్చు లేదంటే ఓటీటీ లో వచ్చేదాకా లాగండి.
Rating :- 2.25 /5