telugu cinema reviews in telugu language

Peddanna Movie Review and Rating | హిట్టా ఫట్టా

Peddanna Movie Review and Rating

Movie :- Peddanna (2021) Review

నటీనటులు :- రజినీకాంత్ , నయనతార , కీర్తి సురేష్ , మీన , కుష్బూ

నిర్మాతలు :- కళానిధి మారన్

సంగీత దర్శకుడు :- డి. ఇమ్మాన్

డైరెక్టర్ :- శివ

Release date :- 4 November 2021

Important Note: – Every article / review written or to be written on this website is written with our own opinion. It is important to note that this is not a site that gives ratings for money. We do not care if someone forwarded links to our website reviews and sent you money. Appropriate legal action will be taken if anyone commits such acts. If in doubt, mail to teluguvision1@gmail.com aware be aware of frauds and fake people.

Story ( Spoiler Free ):-

ఈ కథ కలకత్తా లో రజిని ని చూపిస్తూ మొదలవుతుంది. వెంటనే ఫ్లాష్ బ్యాక్. వీరన్న ( రజిని ) విలేజ్ ప్రెసిడెంట్. వీరన్నకి అతని చెల్లెలైన కనకం ( కీర్తి సురేష్ ) అంటే పంచప్రాణాలు. కనకం కోసం ఏమైనా చేయగలడు ఎంత దూరం అయినా వెళ్లగలడు వీరన్న.

అయితే వీరన్న కనకం పెళ్లి ఫిక్స్ చేసి పెళ్లి పనులు అన్ని చెయ్యగా ముహూర్తామ్ సమయానికి కనకం ఎవ్వరికి చెప్పకుండా ఇంటినుంచి పారిపోతుంది. ఇలా వీరన్నకు ఎదురు దెబ్బ తగిలేసరికి చాల బాధకు గురవుతారు. ఆలా 6 నెలలు గడిచాక కనకం కలకత్తా లో ఉందని , ఎన్నో సమస్యలు ఎదురుకుంటుందని వీరన్న తెలుసుకుంటాడు.

ఈ వార్త తెలుసుకున్న వీరన్న కనకం కోసం ఎం చేయబోతున్నాడు ? వీరన్న ఎలాంటి సమస్యలను ఎదురుకొనబోతున్నాడు ? అస్సలు కనకం ఎందుకు పెళ్ళి సమయానికి పారిపోయింది ? దీని వెనకాల కారణం ఏంటి ? కలకత్తా లో కనకం ఎలాంటి సమస్యలనూ ఎదుర్కొంటుంది ? చివరికి వీరన్న ఎం చేసాడు ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.

Positives👍 :-

  • ఎప్పటిలాగే రజినీకాంత్ తన స్టైల్ మరియు మ్యానరిజం తో అభిమానులని అలరిస్తారు. కీర్తి సురేష్ , నయనతార , మీన , కుష్బూ కూడా వారి వారి పరిధిలో చాలా బాగా చేశారు.
  • కామెడీ మరియు యాక్షన్ సన్నివేశాలు.
  • ఎడిటింగ్ పర్వాలేదు.
  • మ్యూజిక్ ఓకే.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

Negatives👎 :-

  • దర్శకుడు సరిగ్గా తియలేకపోయారు.
  • తెలిసిన కథే అయినా కథనం కొత్తగా రాసుకుని తీయాల్సింది.
  • సినిమా యొక్క నిడివి.
  • అనవసరపు సన్నివేశాలు మరియు సంబంధం లేకుండా ఫైట్స్ బోర్ కోటిస్తుంది.

Overall :-

మొత్తానికి పెద్దన్న అనే సినిమా తెలిసిన కథతో వచ్చిన కథనం కొత్తగా లేకపోవడం. దర్శకత్వం చాలా బలహీనంగా ఉండటం సినిమా మీద ఉన్న ఆశలని నిరాశ గా మిగిలిస్తాయి. రజిని , నయనతార మరియు కీర్తి సురేష్ నటన కోసం సినిమా చూడటం తప్ప మిగితా సైడ్ రోల్స్ చేసిన వారు కూడా సరిగ్గా చేయలేకపోయారు. కామెడీ అక్కడక్కడ తప్ప పెద్దగా పండలేదు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. రజిని మ్యాన్నరిజం కి తగ్గట్టు ఫైట్స్ పెట్టారు.

నిర్మాణ విలువలు బాగున్నాయి. మ్యూజిక్ ఓకే కానీ ఎడిటింగ్ బాలేదు చాలా వరకు ట్రిమ్ చేసేయాలి. మొత్తానికి పెద్దన్న అనే సినిమా ఒకసారి ఓపిక తో చూసే వాళ్ళు చూసేయచు.

Rating :- 2.25 /5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button