Tollywood news in telugu

అప్పుడు పవన్ ని ఇప్పుడు శింబుని

శంకర్ ,కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు సీక్వెల్ చేస్తున్న విషయం మనందరికీ విధితమే .ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.ఇందులో తొలత కమల్ హాసన్ మనవడిగా శింబు నటిస్తున్నాడని అందరు అనుకున్నారు కానీ శింబు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడని తాజా సమాచారం.

ఈ రోజు నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది .కరెక్ట్ గా ఈ సమయంలో శింబు ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో చిత్ర యూనిట్ షాక్ కి గురైందట.ఇప్పుడు ఆ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనే ప్రశ్న కంటే శింబు ఈ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నాడు అనే ప్రశ్న ఎక్కువ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

అసలు శింబు ఈ ప్రాజెక్టు నుండి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది తమిళ్ రీమేక్ లో శింబు నటించాడు.దాన్ని లైకా ప్రొడక్షన్స్ ఏ నిర్మించింది.ఆ చిత్రానికి శింబుకు ముట్టాల్సిన రెమ్యూనరేషన్ విషయంలో లైకా ప్రొడక్షన్స్ ఇబ్బంది పెడుతుందని అందుకే తను ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడట.గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్ లో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో నటించినప్పుడు తన రెమ్యునరేషన్ విషయంలో కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారట.ఆ ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడు ఇంతేనని ఆ స్టార్ హీరోల అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Read  అందాల అనసూయా....

స్టార్ లైన సొమ్ముల ముందు సామాన్యులే అంటూ ఈ ఉదంతాన్ని చూసినవారంతా కామెంట్ చేస్తున్నారు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button