Pawan Kalyan Uppena open : ఉప్పెనచిత్రం గురించి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఏమన్నాడంటే…!

Pawan Kalyan Uppena: మెగా అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ఉప్పెన కూడా చేరిపోయింది. ఈ సినిమా ద్వారా మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్లుగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు.
డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో విడుదల ఐంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు, విజయ్ సేతుపతి నటన ఉప్పెనపై అంచనాలు పెంచింది.
అదేవిదంగా ఈ సినిమా లో ఉండే జనరల్ విషయాల వల్ల మలుపులు తిరిగే కథ ప్రేక్షకులకు గుర్తుండి పోయేలా చేస్తాయి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇందులో వైష్ణవ్ తేజ్ ఆశీర్వాదం అనే బోయ కుర్రాడి పాత్రలో కనిపించగా… కృతి శెట్టి బేబెమ్మగా, విజయ్ సేతుపతి రాయణంగా కనిపించనున్నారు. ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందించారు.
మరోవైపు మెగా ఫ్యామిలీలోని రామ్ చరణ్, సుస్మిత, వరుణ్ తేజ్ తదితరులు ఈ మూవీని చూసినట్లు సమాచారం. వీరితో పాటు సినిమా పెద్దలు కూడా చూసి దర్శకుడిపై ప్రశంసల తో ముంచెత్తుతున్నారు.