PK On Tamil Industry : ఆ విషయంలో తమిళ్ ఇండస్ట్రీ తెలుగ ఇండస్ట్రీని చూసి నేర్చుకోవాలి
PK On Tamil Industry : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్న.. ఆయన విజువల్ చూసిన.. ఆయన అభిమానులకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. సినిమా హిట్ ఫ్లాప్ అని తేడా లేకుండా… తనకంటూ ఓ మార్కెట్ ని సెట్ చేసుకున్న జనసేన ని తాజాగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అటు మూవీస్ చేస్తూ ఇటు రాజకీయాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పాదయాత్రలతో, బస్సు యాత్రలతో పవన్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం మూవీ యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. అందులో పవర్ స్టార్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ వాళ్లు తీయాలంటే ముందు వాళ్ళ ఆలోచన ధోరణి మార్చుకుని బయటకు రావాలన్నారు. మన పరిశ్రమలో మనవారే పని చేయాలి.. మన వారి ఎదగాలనే తమిళ్ వాళ్లు ధోరణి మార్చుకోవాలి… తెలుగు పరిశ్రమ అందర్నీ అక్కున చేర్చుకొని..అన్నం పెడుతుందన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.