Pawan Kalyan Remembering his Shelved film Satyagrahi : 2003 లో ఆగిపోయిన సినిమా గురించి గుర్తుచేసుకుంటున్న పవన్ కళ్యాణ్ :-

Pawan Kalyan Remembering his Shelved film Satyagrahi: Little is said about power star Pawan Kalyan. Whether he is a political leader or a hero in a movie, countless people come to see him. His range in the fan is no different, his position is different. Even if no one can come in that position.
అలాంటి పవన్ కళ్యాణ్ గారి అటు సినిమాలో , ఇటు పాలిటిక్స్ లో బిజీ బిజీ గా జీవనం సాగిస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చిన ముందుగా స్పందిస్తారు.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు సినిమాలతో మరియు ప్రజల సమస్యల మీద పోరాడుతున్న విషయం తెలిసిందే. సినిమాలో కూడా 4 సినిమాలు వరుసగా చేసుకుంటూ వవస్తున్నారు. అలాంటి బిజీ బిజీ లైఫ్ గడుపుతున్న కళ్యాణ్ గారు సడన్ గా 2003 లో ఆగిపోయిన సినిమా గురించి పోస్ట్ చేశారు.
ఆ సినిమా పేరే సత్యాగ్రహి. ఈ సినిమా కి దర్శకత్వం కూడా కళ్యాణ్ గారే చేయాలనీ గ్రాండ్ గా 2003 లో ముహూర్తం పెట్టుకున్నారు. కానీ , కొన్ని అన్నివర్ని కారణాల చేత ఈ సినిమా ఆగిపోయింది.
అయితే సోషల్ మీడియా లో కళ్యాణ్ గారు ఈ సినిమా గురించి పోస్ట్ పెడుతూ ఈ విధంగా అన్నారు ” ముందుగా దిగ్గజ నాయకుడు అయినా లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారి జయంతి సందర్భంగా వారికీ నివాళులు అర్పించి , జయప్రకాశ్ గారి ఐడియాలజీస్ ఏ జనసేన స్థాపించడానికి ముఖ్య కారణం.
దీనికి తోడు కళ్యాణ్ గారు ” సత్యాగ్రహి అనే సినిమా కాంటెంపరరీ సమయం లో జయప్రకాశ్ గారు తీసుకున్న నిర్ణయాలు మరియు చేసిన ఎమర్జెన్సీ ఉద్యమాల గురించి సాగే పొలిటికల్ సినిమా , నేను నిజజీవితంలో ఇలా చేయాలనే ఈ సినిమా అప్పట్లో ఆగిపోయిందేమో , అయినా సినిమాలో నడవడం కన్నా నిజజీవితంలో ప్రజలతో పాటు నడవడం నాకు ఆనందాన్ని ఇస్తుంది ‘ అన్ని కళ్యాణ్ గారు చెప్పారు.
ఏదేమైనా కళ్యాణ్ గారు 2003 లో ఆగిపోయిన సత్యాగ్రహి సినిమా గురించి మరల గుర్తుచేయడం తో అభిమానులకు చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు సడన్ గా కళ్యాణ్ గారు దీని గురించి చెప్పారంటే మరల డైరెక్షన్ వైపు కళ్యాణ్ గారు అడుగులు వేసి సత్యాగ్రహి సినిమా చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎం జరగబోతుందో.