Pawan Kalyan: పవర్ స్టార్ కొత్త సినిమా రీలీజ్ డేట్ ఫిక్స్…!
Pawan Kalyan: పవర్ స్టార్ కొత్త సినిమా రీలీజ్ డేట్ ఫిక్స్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రేక్షకులను వకిల్ సాబ్ చిత్రంతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు సిద్ధమయ్యాడు. అసలు ఈ చిత్రం 2020 ఏప్రిల్ లొనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా దృష్ట్యా తొమ్మిది నెలల షూటింగ్ వాయిదా పడింది. ఇటీవలే మళ్లీ తిరిగి చిత్ర షూటింగ్ ప్రారంభమై మంగళవారం కంప్లీట్ అయింది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా అగ్ర నిర్మాత అయిన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయినందున..2021 సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 19న వకిల్ సాబ్ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 2018లో అజ్ఞాతవాసి తో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్… మళ్లీ నాలుగేళ్ల తర్వాత వెండి తెరపై కనిపించబోతున్నా సందర్భంగా ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.