Pawan kalyan and Harish shankar Deadly Combination : భవదీయుడు భగత్ సింగ్ గా పవన్ కళ్యాణ్ :-

Pawan kalyan Harish shankar Deadly Combination : పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు తీస్తున్న అభిమానులకు మాత్రం పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా ఎపుడు అనే ధ్యాసనే ఉండేది.అప్పట్లో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలిసి చేసిన హుంగామ అంత ఇంత కాదు కదా మరి. గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది.
ఇపుడు పవన్ కళ్యాణ్ 28 వ సినిమా హరీష్ శంకర్ తో అనగానే ఫాన్స్ ఖుషి అంత ఇంత కాదు. దానికి తోడు హరీష్ శంకర్ ఈసారి ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు అనేసరికి అభిమానుల ఆనందం రెట్టింపు అయింది. అయితే ఈరోజు ఈ సినిమా పోస్టర్ తో పాటు టైటిల్ కూడా వదిలారు. పవన్ కళ్యాణ్ బైక్ పైన కూర్చొని ఒకచేతిలో లౌడ్ స్పీకర్ ఇంకో చేతిలో టీ తాగుతూ స్టైలిష్ గా ఉండగా టైటిల్ భవదీయుడు భగత్ సింగ్ అని చెప్పారు. కాబట్టి ఈసారి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కలిసి గబ్బర్ సింగ్ రికార్డ్స్ ని తిరగరాయాలని గట్టిగ ఫిక్స్ అయినట్లు ఉన్నారు.
పోస్టర్ తోనే ఫాన్స్ కడుపు నిండిపోయింది. ఇక ముందు , ముందు ఈ సినిమా అప్ డేట్స్ వస్తు ఉంటె ఫాన్స్ కి పూనకాలే.