Tollywood news in telugu

Pawan Kalyan For Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ తరుపున పవన్ కళ్యాణ్ బాధ్యతలు వహిస్తున్నారు :-

Pawan Kalyan For Sai Dharam Tej

Pawan Kalyan For Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ ఇపుడిపుడే యాక్సిడెంట్ నుంచి రికవర్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. కాకపోతే ఇంకా తేజ్ పూర్తిగా కోలుకోలేదు. ఐ.సి.యు వార్డ్ నుంచి నార్మల్ వార్డ్ కి మార్చినట్లు , మరో 3 రోజులో డిశ్చార్జ్ చేస్తారని తెలిసిందే.

ఇదిలా ఉండగా దేవా కట్టా దర్శకత్వంలో తేజ్ నటించిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1 న విడుదలకు సిద్ధం అవుతుంది.

ఇదివరకే చిరంజీవి గారు ట్రైలర్ లాంచ్ చేస్తున్న సమయం లో ఈ విధంగా అన్నారు ” తేజ్ ఇపుడిపుడే కోలుకుంటున్న కూడా అతని కోరిక మేరకు రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1 న విడుదల చేస్తున్నామని చెప్పారు ” తేజ్ కి రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1 న విడుదల చేయాలనీ షూట్ స్టార్ట్ చేసినప్పటినుంచి కోరుకున్నారంట.

అయితే ట్రైలర్ లాంచ్ చిరంజీవి గారు చేయగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తేజ్ తరుపున బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అభిమానులకు తేజ్ తరుపున బాధ్యతలు స్వీకరించి సినిమా ప్రమోట్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు.

ఇదివరకే పవన్ కళ్యాణ్ ఫర్ సాయి ధరమ్ తేజ్ అని రిపబ్లిక్ చిత్రబృందం అధికారికంగా ఈ విషయం ప్రకటించారు. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 25 న జరగబోతుంది. సాయి ధరమ్ తేజ్ బదులు కళ్యాణ్ గారు వచ్చి అభిమానులకు డబల్ ధమాకా ఇయ్యనున్నారు. ఈ వార్త విన్న అభిమానులు తమ ఆనందాన్ని ట్విట్టర్ లో ట్యాగ్ రూపం లో వ్యక్తం చేస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button