Pawan Kalyan Divorce : మళ్ళీ పవన్ విడాకులు? రూ.1800 కోట్లు? అసలు నిజమేంటంటే…!
Pawan Kalyan Divorce : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్న.. ఆయన విజువల్ చూసిన.. ఆయన అభిమానులకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. సినిమా హిట్ ఫ్లాప్ అని తేడా లేకుండా… తనకంటూ ఓ మార్కెట్ ని సెట్ చేసుకున్న జనసేన ని తాజాగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అటు మూవీస్ చేస్తూ ఇటు రాజకీయాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పాదయాత్రలతో, బస్సు యాత్రలతో పవన్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వబోతున్నట్లు విపరీతమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రూ.1800 భరణం కూడా పవన్ భార్యకు ఇవ్వబోతున్నాడంటూ పలు వెబ్ సైట్ లో పేర్కొంటున్నారు. అయితే ఇది అంత వైసిపి చేస్తున్న దుష్ప్రచారమని పీకే అభిమానులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

అయితే ఇందులో అసలు నిజమేంటో చూద్దాం… ఈ వార్తలకు మొదటి కారణం వరుణ్ తేజ్ లావణ్యల నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ ఒక్కరే రావడం. అలాగే రామ్ చరణ్ ఉపాసన కుమారై నామకరణానికి కూడా అన్నా లెజ్నెవా హాజరు కాకపోవడంతో ఆమె పిల్లల్ని తీసుకొని రష్యా వెళ్ళిపోయిందంటూ కొందరు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఆమె వాళ్ల పిల్లల చదువు కోసం రష్యా వెళ్లినట్లు తెలుస్తుంది. వాళ్లతో పవన కళ్యాణ్ రోజు ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ మాట్లాడతారని ఎప్పుడు వాళ్ళతో టచ్ లోనే ఉంటున్నారని విశ్వసనీయ సమాచారం.