Bro Movie Telugu Review : పవర్ స్టార్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిందా?
Bro Movie Telugu Review :
టైటిల్: బ్రో
నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం : ఎస్ఎస్ తమన్
రచన మాటలు & డైలాగ్స్ : త్రివిక్రమదర్శకత్వం: సముద్రకానీ
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల
విడుదల తేదీ : 28 July 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్న.. ఆయన విజువల్ చూసిన.. ఆయన అభిమానులకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. సినిమా హిట్ ఫ్లాప్ అని తేడా లేకుండా… తనకంటూ ఓ మార్కెట్ ని సెట్ చేసుకున్న జనసేన ని తాజాగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అటు మూవీస్ చేస్తూ ఇటు రాజకీయాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పాదయాత్రలతో, బస్సు యాత్రలతో పవన్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో పవర్ స్టార్ ఒక కీలక పాత్రలో నటించగా..సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ జంటగా మెరిసారు. ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పైన నిర్మించారు. ఈ చిత్రానికి సముద్రకాన్ని దర్శకత్వాన్ని వహించారు. ఈ బ్రో మూవీ తమిళంలోని వినోదయ సీతమ్ అనే మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళంలో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులో ఈ చిత్రానికి మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే రాశారు.అయితే బ్రో సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ట్రైలర్, టీజర్ కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి.

కథలోకి వెళ్తే… స్టార్టింగ్ లో మార్కండేయ అలియాస్ మార్క్ (సాయి ధరమ్ తేజ్) వాళ్ల తండ్రి హఠాత్తుగా మరణించడంతో.. వాళ్ల కంపెనీకి తానే అన్నై ఆయా కంపెనీ బాధ్యతలను స్వీకరిస్తాడు. తన ఫోకస్ అంతా కంపెనీ డెవలప్మెంట్ పైనే మార్క్ పెడతాడు. ప్రతిక్షణం కంపెనీ కోసమే వర్క్ చేస్తాడు. దీంతో ఇటు ఫ్యామిలీకి టైం కేటాయించలేక పోతాడు. అలాగే ప్రేయసి తో కూడా సరిగ్గా మాట్లాడకపోవడంతో… వారి ప్రేమ బ్రేకప్ దాకా కూడా వెళ్లే పరిస్థితి వస్తుంది. అప్పుడే సడన్ గా మార్క్ కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో మార్క్ మరణిస్తాడు. ఆ చనిపోయే చివరి క్షణంలో తన కుటుంబం మార్క్ కి గుర్తుకువస్తుంది.

ఇంతలో టైం ( పవన్ కళ్యాణ్) దర్శనం ఇస్తాడు. అతన్ని కొన్ని రోజులు గడువు ఇవ్వమని ఇస్తే తాను కంపెనీ బాధ్యతలను తన సోదరుడికి అప్పచెప్పి అతని వివాహం చేసి వస్తానని టైం చెప్పగా.. అతను ఒక కండిషన్ పెడతాడు. తనతోపాటు తాను కూడా వస్తానని చెప్పి.. మళ్లీ మార్కిని బతికిస్తాడు. అయితే బతికి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. వాళ్ల సోదరుడు సోదరి మంచి ప్రణాళికలు వేసుకున్నారు. ఆ తర్వాత వాటిని చూసిన మార్క్ ఎలా రియాక్ట్ అవుతాడో అనేదే మిగిలిన కథ..

ఇక మూవీ ఫస్ట్ ఆఫ్ కొంచెం రోటీన్ స్టోరీ లాగానే అనిపించడంతో కొంచెం బోరింగ్ గా ఫీల్ అవుతారు.. పవన్ కళ్యాణ్ ఎంట్రి మాత్రం ఫ్యాన్స్ లో మంచి హుషారని నింపుతుంది. సెకండ్ ఆఫ్ ఎమోషనల్ గా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో పవర్ స్టార్ డిఫరెంట్ గెటప్స్ లో కనువిందు చేయడంతో ఫ్యాన్స్ కి పండగే. ఓవరాల్ గా ఈ సినిమా యావరేజ్ టు ఎబౌవ్ యావరేజ్ అనే మాదిరిగా ఉన్నట్లు స్పష్టమవుతుంది.
రేటింగ్ : 2.75/5