bheemla nayak song | పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దిల్ కుష్?

Pawan Kalyan Bheemla Nayak Title Song creates huge Sensation : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దిల్ కుష్ :-
పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దిల్ కుష్ అయింది. ఎంత హ్యాపీ గా ఉన్నారంటే మాటలో చెప్పలేనంతగా. దీనికి కారణం ఏంటి అని అనుకుంటున్నారా.
మ్యాటర్ లోకి వెళ్తే మాటల మాంత్రికుడి అదేనండి త్రివిక్రమ్ గారి పుట్టినరోజు కానుకగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న భీమ్లా నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ లాల భీమ్లా అనే లిరికల్ వీడియో విడుదల చేశారు. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ పాట రాసింది త్రివిక్రమ్ గారే. పాటలోని ప్రతి అక్షరం లార్డ్ కృష్ణ మీదనే పవన్ కళ్యాణ్ కి తగ్గట్టు రాశారు.
శ్రీకృష్ణుడు చేసిన పనులను లిరిక్స్ గా రాసి దానికి పవన్ కళ్యాణ్ గారిని తన స్టైల్ లో చుపియడం అభిమానాలకు పూనకాలే అని చెప్పాలి. ఆ 2 నిమిషాల వీడియో లో పవన్ కళ్యాణ్ మ్యానరిజం , స్టైల్ అభిమానులకు రెట్టింపు ఆనందానికి ఇచ్చిందని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు.
థమన్ మ్యూజిక్ పాటకి డబల్ బలాన్ని ఇచ్చింది. లిరికల్ వీడియో నే ఈ రేంజ్ హుంగామ చేస్తుంటే ఇంకా సినిమా లో ఈ పాట కి అభిమానులు సీట్లలో కూర్చోరు అని అర్ధం అయిపొయింది.
సినిమా కి సంబంధించి ఇప్పటిదాకా విడుదలైన మూడు పాటలు బ్లాక్ బస్టర్ ఏ. చూడాలి మరి సినిమా ఏ రేంజ్ హుంగామ చేయబోతుందో.. వేచి చూడక తప్పదు.