RGV ఆఫీస్ పైన దాడి !

Pawan fans attack on varma:RGVపవన్ పైన తీసిన “పవర్ స్టార్” అనే సినిమా వివాదాలతో పాటు రోజుకో సంచలనం గా బ్రేకింగ్ న్యూస్ వస్తూనే ఉంది, వర్మ పైన సినిమా అంటూ ఒకరు , వర్మ పైన మరొక సినిమా అంటూ ఇంకొకరు పోస్టర్స్ రిలీజ్ చేశారు.
ఇటీవల టీవీ 9 ఇంటర్వ్యూ లో ఓ యాంకర్ వర్మని మీకు అంత ధైర్యం ఎక్కడినుండి వస్తుంది , మీకు భయం వేయట్లేదా మీకొచ్చే బెదిరింపుల పట్ల అని అడగగా , వర్మ సమాధానం గా మొరిగే కుక్క కరవదు అని సమాధానం ఇచ్చాడు , అయితే ఇంటర్వ్యూ జరిగి 24 గంటలు కాకముందే , వర్మ ఆఫీస్ పైన రాళ్లతో గుర్తు తెలియని యువకులు దాడి చేయగా , వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
అయితే దీనిపైనా వర్మ స్పందిస్తూ , నా సినిమాకి ఇంకా పబ్లిసిటీ ఎక్కువ వచ్చింది ఇంకా వ్యూయర్స్ పెరిగిపోతారు , నా ఫ్యాన్స్ కుడా 50 మంది కాపలాగా ఉంటా అని అంటున్నారని చెప్పాడు . మరి ఇది ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి .