Pawan Daughter Aadhya : పట్టుపరికినిలో తళుక్కుమన్నా పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య !
Pawan Daughter Aadhya Photo : రేణు దేశాయ్ తన కూతురు, కొడుకు లను షోషల్ మీడియాలో చాల తక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. వారి వ్యక్తిగత జీవనానికి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇపుడు తాజాగా రేణు దేశాయ్ ఈ సంక్రాంతి పండగ సందర్బంగా తన కూతురు ఆద్య ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. రేణు పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తరువాత ఆద్య, అకిరా లతో పుణేలో జీవిస్తున్నారు.

వీరు పూణే లో ఉన్నప్పటికీ వారి బాధ్యతలను మాత్రం పవన్ మరిచిపోలేదు. ఎదో విదంగా వారి కావలసిన మేలు చేస్తూనే ఉన్నారు.
ప్రత్యక సందర్భాలలో పవన్ తన పిల్లలతో గడుపుతాడు. అదేవిదంగా మెగా ఫ్యామిలీ తో కూడా ఆద్య, అకిరాల బంధం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. కొన్నిరోజుల క్రితం నిహారిక పెళ్ళిలో పవన్ కళ్యాణ్ తన పిల్లలతో కలిసి హాజరయ్యాడు. వీరు మెగా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.
ఆధ్య సంక్రాంతి పండగ సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణలో దిగిన ఫోటో ఇపుడు షోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఆద్య పట్టు పరికిణి, పాపిడి బిళ్లతో, మెడలో హారంతో కుందనపు బొమ్మలా కనపడుతుందని పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అదేవిదంగా తన ముఖానికి మాస్క్ ఉండడంతో ఫ్యాన్స్ కొత్త నిరుత్సాహానికి లోనయ్యారని తెలుస్తుంది.