Tollywood news in telugu

పవన్, రానా కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్ ప్రారంభం !

Pawan and Rana start shooting for a movie together

టాలీవుడ్ లో మరొక  భారీ మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ఈ రోజు హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ ఫ్యాక్టరీలో వేసిన సెట్లో దాదాపుగా 20 రోజులకు పైగా షూటింగ్ జరగనుంది. ఈ సినిమా యొక్క పేరును  ఇంకా ప్రకటించలేదు.

అదేవిదంగా ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ప్రముఖ దర్శకుడు, హీరో పవన్ కల్యాణ్ స్నేహితుడైనటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తున్నారని సమాచారం.

కేరళలో సూపర్ హిట్ కొట్టిన  ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’  అనే సినిమాని తెలుగులో  రీమేక్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో చిత్ర యూనిట్ అఫిషియల్ గా ప్రకటించాల్సి ఉంది. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read  ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్, రాజమౌళి.. ముగ్గురు ఒకే ఫ్రెమ్ లో ఎందుకు కలిశారంటే?
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button