News

pavan kalyan leaked photos : షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన పవన్ ఫొటో ..సోషల్ మీడియాలో వైరల్

pavan kalyan leaked phtos

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటు రాజకీయాలు, అటు సినిమాలను బ్యాలన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే  కమిటైన సినిమాలు చేస్తూ బిజిగా గడుపుతున్నాడు.  ఇటీవలే తన ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తిచేసుకున్న తరువాత చేయబోయే  సినిమాలపై ఫోకస్ పెట్టారు. అదేంటంటే మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా ను తెలుగు రీమేక్‌‌ సెట్స్ పైకి వచ్చారు. పవన్ కళ్యాణ్. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.

అయితే ఈ మూవీతో పాటు ప్యారలల్‌గా క్రిష్ సినిమాను కూడా పట్టాలెక్కించేసారు. ఇది పవన్  కెరీర్‌లో 27వ సినిమా కానుంది.  ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన అందాల తార ‘నిధి అగర్వాల్’, బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌’ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలుస్తుంది.

ఈ మూవీ  మొగలాయిలా కాలంనాటి కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన పవర్ స్టార్ ఫొటో లీక్ కావడం తో షోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం 170 కోట్ల రూపాయలు ఖర్చుచేయనున్నట్టు తెలుస్తుంది.  

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button