Tollywood news in telugu

పీకే లవ్… చిక్కుల్లో పూనమ్ కౌర్

టాలీవుడ్ లో శ్రీకాంత్ సరసన మాయాజాలం సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిoది poonam kaur. కాని హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. అడపాదడపా హీరో గోపిచంద్ చెల్లిగా శౌర్యం, వినాయకుడు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. కానీ, ఏ సినిమా కూడా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు. రీసెంట్ గా వచ్చిన శ్రీనివాస కళ్యాణం సినిమాలో హీరోయిన్ అక్కగా కూడా నటించింది. ప్రస్తుతం ఆమె ఈటీవీలో ప్రసారమవుతున్న బాహుబలి నిర్మాతలు రూపొందిoచిన స్వర్ణ ఖడ్గం అనే సీరియల్ లో నటిస్తుంది.

అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి కత్తి మహేష్ కి మధ్య రేగిన వివాదం కారణంగా పూనమ్ వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీని గురించి ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దీనితో పవన్ ఫాన్స్ ఆమెపై మండిపడ్డారు. దాంతో కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉంది. తాజాగా మరోసారి తన ట్వీట్లతో కొందరు నెటిజన్లకు టార్గెట్ అయింది. దీనికి కారణo తాజాగా ఆమె ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్ట్ . దాంతో ఆమె ఎమోషనల్ అవుతూ ఓ ట్వీట్ చేసింది. కృష్ణాష్టమి సందర్భంగా poonam kaur ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేయబోతున్నానని ఆదివారం ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నది. చెప్పినట్టుగానే పూనమ్ సోమవారం ఉదయం ఓ టీజర్ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో ఎంతో క్యూట్‌గా, అందంగా కనిపించిన పూనమ్ అందరి ప్రశంసలు అందుకుంది. చాలా సంతోషంతో, మనస్ఫూర్తిగా రూపొందించిన వీడియో ఇదని అన్నారు. కాకపోతే పీకే లవ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది.

Read  RRR Ramcharan - అభిమానులకు డబల్ ధమాకా:-

పీకె లవ్ అంటూ ఆమె ట్వీట్ చేయడంతో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు poonam kaurమీద విరుచుకుపడ్డారు. విపరీతమైన ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. దాంతో ఆమెకు నెటిజన్స్ నుంచి తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. దీనితో ఆమె విడుదల చేయాలనుకున్న పూర్తి వీడియో కూడా రిలీజ్ చేయలేదు. దీంతో తాజాగా మరొక ట్వీట్ చేసింది.

‘నేను ఎంతగా కష్టపడ్డా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత నిజాయితీగా చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ కొన్ని విషయాల్లో నా తప్పు లేక పోయినా నన్ను దూషిస్తున్నారు. ఇది నన్ను చాలా బాధించింది. నా హృదయానికి చాలా దగ్గరయిన వీడియో అది.. అంటూ poonam kaur బాధను వ్యక్తం చేసింది. అందరి దృష్టిని మరోసారి తిప్పుకోవడం కోసమా లేక ఇంకేదైనా కారణమా తెలియదు కానీ  పీకేకు అర్థం ఏంటో తెలియట్లేదు. పూనమ్ మాత్రం ఇంకా అలా ఎందుకు పెట్టిందో చెప్పలేదు.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button