News

Palakollu murder: అద్దె అడిగినందుకు ఓనర్ను…ఏంచేశారంటే…!

Palakollu murder

Palakollu murder:  పశ్చిమ  గోదావరి జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం తన ఇంట్లో ఉంటునందుకు  ఇంటి అద్దె అడిగాడు  యజమాని, దీనికి కిరాయున్న వ్యక్తి  దారుణంగా హతమార్చాడు.   పాలకొల్లు ముచ్చర్లవారివీధిలో ఈ  దారుణ ఘటన చోటుచేసుకుంది. 

ఇంటి కిరాయి అడిగినందుకు  కోపంతో ఓనర్ వంగా ప్రసాద్​ను, కిరాయికి ఉన్న వ్యక్తి అడపా చినకొండయ్య కిరాతకంగా చెంపేసాడు.  ముచ్చర్లవారివీధిలోని వంగా ప్రసాద్ ఇంట్లో  సంవత్సరం నుండి  చినకొండయ్య తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కొండయ్య 2నెలలుగా ఇంటి కిరాయి ఇవ్వలేదు.

ఈ విషయమై ఇంటి ఓనర్ ప్రసాద్​కు , చిన కొండయ్య మధ్య సోమవారం రాత్రి పెద్ద గొడవే జరిగింది.  అదేసందర్భంలో కోపంతో ఊగిపోయిన కొండయ్య పక్కనే ఉన్న బండ రాయితో ఓనర్‌ తలపై బాదాడు. ఆ దెబ్బకు  తీవ్ర రక్తస్రావమై ప్రసాద్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button