Pakistan economy crash: ఒకప్పుడు సంపన్న దేశంగా ఉన్న పాక్.. ఇప్పుడు దివాలా తీసింది ఎందుకు?
Pakistan economy crash : ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పడిపోవడం మనం టీవీలో వార్తలు చూస్తున్నాం. అయితే అప్పట్లో పాకిస్తాన్ భారత్ కన్నా ఎకనామీలో ముందు ఉందన్న సంగతి మీకు తెలుసా? కానీ ఇప్పుడు అలా ఎలా దివాలా తీసింది తెలుసా?

1980లో పాక్ పార్ క్యాపిటల్ భారత్ కన్నా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం భారత్ పార్ క్యాపిటల్ పాకిస్తాన్ కన్నా డెబ్బై శాతం ఎక్కువగా ఉంది.1960-1980 వరకు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది. 1961-1980 వరకు పాకిస్తాన్ గ్రోత్ రేటు 6% ఉంటే ఇండియా గ్రోత్ రేటు 4% మాత్రమే ఉంది. 1947 లో ఇండియా పాకిస్తాన్ విడిపోయింది. కొన్ని సమస్యల తర్వాత పాకిస్తాన్లో వేస్ట్ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ అని రెండు వర్గాలుగా విడిపోయారు. వేస్ట్ పాకిస్తాన్ లో ఉర్దూ భాష మాట్లాడితే..తూర్పు పాకిస్తాన్ లో బెంగాలీ మాట్లాడే వారు. దీంతో ఎన్నో వివాదాలు తర్వాత 1971 లో నార్త్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్ దేశంగా మారింది. పాకిస్తాన్లో కాకుండా బంగ్లాదేశ్ లో టెక్స్టైల్ కంపెనీలు ఎక్కువగా ఉండడంతో… పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. దీంతో 1972-1977 తీవ్ర ఆర్థిక ద్రవ్యోలబణానికి దారి తీసింది. పొరుగున ఉన్న భారతదేశం మాత్రం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ వస్తుంది. కానీ ఇంత జరిగినా పాకిస్తాన్ కి బుద్ధి రాలేకపోగా.. టెర్రరిజంని పెంచి పోషించింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ దేశం పూర్తిగా దివాలా తీసింది.