Tollywood news in telugu

Paagal Teaser – Vishwak Sen : పాగల్ లవర్ గా విశ్వక్ సేన్…తన లవ్ గురించి టీజర్ లో ఎంత స్ట్రాంగ్ గా చెప్పాడో చుడండి…!

Paagal Teaser - Vishwak Sen

Paagal Teaser – Vishwak Sen : నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్న  లక్కీమీడియా పతాకంపై పాగల్  సినిమా రాబోతుంది.  ఈ సినిమా టీజర్ యూనిట్  అఫీషియల్ గా విడుదల చేసింది. విశ్వక్  పాగల్  లవర్ గా మారినట్టు టీజర్ లో చూపించారు. తన ప్రేమ ఎంత స్ట్రాంగ్ గా ఉందొ కూడా ఇందులో చెప్పాడు.

ఇక ఇందులోని కొన్ని హైలెట్స్ డైలాగ్స్ ని చుస్తే…  ఎవడ్రా నా లవర్ ని ఏడిపించిందంటూ చెప్పే డైలాగ్స్ ఈ సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి.  అలాగే నా లవర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనబడట్లేదురా.. నన్ను ఇంకా గట్టిగా కొట్టండి, మీరు కొట్టే కొట్టుడు నా లవ్ అంత స్ట్రాంగా  గా ఉండాలి అని రౌడీలను అడుగుతున్నాడు. హీరో విశ్వక్ చెప్పే డైలాగులకు రౌడీల కళ్ళల్లో భయం కనపడుతుంది.

ఇంకా నా లవర్ ని సినిమాకు రమ్మంటున్నావట అంటూ ఒక కాలేజ్ సీనియర్ తో అనే డైలాగ్ కూడా యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. హీరో రింగు రింగు జుట్టుతో స్మార్ట్ గా కనిపిస్తూ , వైల్డ్ గా చెప్పే డైలాగ్స్ యువతనే కాకుండా,  చిన్నతనంలో ఎదుర్కొన్న విషయాలను పెద్దవారికి కూడా గుర్తు చేసేలా ఉన్నాయ్.

Read  అందాల అనసూయా....

అదేవిదంగా ఇందులో లవర్ తో పాటుగా ఇంకొంతమంది అమ్మాయిల్ని కూడా ఇతని డైలాగ్స్ కి పడిపోయేలా  ఉన్నారు. ఏకంగా ఒక రోజా పువ్వు ను ముసలావిడకు ఇచ్చి ఆవిడను ఆశ్చర్యానికి గురిచేశాడు.

ఓరల్ గా సినిమా డైలాగ్స్ పరంగా, ఫైట్స్ పరంగా చాల బాగుందని చెప్పాలి. నరేష్ కుప్పిలి డైరెక్ట్ చేస్తున్న  ఈ సినిమా    ఏప్రిల్ 30వ తేదిన విడుదల కాబోతోంది.

 విశ్వక్ సేన్ తన స్ట్రాంగ్ పర్ఫామెన్స్ తో బాక్స్ ఆఫిస్ బద్దలుకొట్టేలా కనబడుతున్నాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button