Today Telugu News Updates
చంద్రుని పైకి మన రాజా చారి…. నా తల్లిదండ్రులే ఈ విజయానికి కారణం !

అమెరికా అంతరిక్ష నాసా సంస్థ మానవులను చంద్రుని పైకి పంపే చంద్రయాన కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి ఆర్టిమిస్ అనే పేరు కూడా వెల్లడించారు. అయితే చందమామపై మరోసారి కాలు మోపేందుకు సన్నద్ధమవుతున్న నాసా బృందంలో భారత సంతతి కి చెందిన చారి కి స్థానం లభించింది.
నాసా మిషన్‌కు 43 ఏళ్ల రాజా జాన్ వుర్పుత్తూర్ చారి కి అవకాశం దక్కింది. ప్రస్తుతం చారి శిక్షణలో పాల్గొంటున్నట్లు నాసా సంస్థ తెలిపింది .
ఈ కార్యక్రమంలో నేను ఒక భాగమవడం చాల గర్వంగా ఉంది. నా తల్లిదండ్రుల వల్లే నేను ఇది సాధించాను అని తెలిపాడు. ఇదిలా ఉంటె చారి మస్సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, యూఎస్ నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లో చదివాడు. 2017లో నాసాలో చేరి ఇపుడు మూన్ మిషన్‌లో చోటు దక్కించుకున్నాడు.