Krack మూవీ పైన ముదురుతున్న వివాదం… దిల్ రాజు పైన నిప్పుల వర్షం….
ఉస్మానియా జేఏసి అధ్యక్షుడు,జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్ నిర్మాత దిల్ రాజు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు కొత్త వారికి అవకాశాలు ఇవ్వట్లేదని.. వారిని తొక్కేస్తున్నారు అని సంపత్ మండిపడ్డారు.

ఇటీవలే రిలీజ్ అయిన క్రాక్ సినిమా కోసం శీను అనే డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు నాకు సినిమాలు ఇస్తానని చెప్పి…మోసం చేశాడని.. తను ఎన్నో కోట్లు పెట్టి నష్టపోయానని… గత పది సంవత్సరాల నుండి దిల్ రాజు నాకు సినిమాలు రాకుండా చేస్తున్నారని.. తనకు న్యాయం చేయాలంటూ జేఏసి అధ్యక్షుడు సంపత్ నాయక్ ను ఆశ్రయించాడు.
దీంతో సంపత్ నాయక్ విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్మాతలైన సునీల్ నారాయణ, శిరీష రెడ్డి, దిల్ రాజు కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలన్నారు. 12 మంది ప్రొడ్యూసర్లు గైడ్ సమావేశంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ శ్రీను ను ” పోరా నువ్వేం పికుంటావో.. పీక్కో” అన్ని అసభ్యకరంగా మాట్లాడడం పట్ల సంపత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిల్ రాజు మీకు మీ అమ్మా నాన్నా నేర్పిన సంస్కారం ఇదేనా…అలా ఎలా మాట్లాడతావు అంటూ సంపత్ విరుచుకుపడ్డారు. ఈ విషయంపై చిరంజీవి, నాగార్జున మోహన్ బాబు స్పందించాలన్నారు. దిల్ రాజు దీన్ని ప్రజాపోరాటంగా చేయకండన్ని.. ఈ మ్యాటర్ ని సెటిల్ చేయండి అన్ని సంపత్ కోరారు. అన్యాయం ఎక్కడ జరిగితే ఓయూ గొంతుకతో ఎక్కడికైనా పోరాడుతామని సంపత్ దిల్ రాజు కు హెచ్చరించారు