మరొసారీ బాలయ్య ను తగులుకున్న నాగబాబు
బాలకృష్ణ పైన వాక్యాల గురించి నాగ బాబు వివరణ..
ఇటీవల నాగబాబు బాలకృష్ణ ల వివాదం ఫిల్మ్ సర్క్యూట్ లో మరియు ఫ్యాన్స్ లో చర్చనీయాంశం గా మారింది, మరికొందరికి ఎంటర్ టైన్మెంట్ గా మారిన విషయం అందరికి తెలిసిందే, అయితే దీనిపైన నాగబాబు వివరణ ఇచ్చారు.
తను బాలకృష్ణ ఎవరో తెలీదని అనటానికి పెద్ద కారణం లేదని తనకి ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాడు, అయితే అలా అనటానికి కారణం బాలకృష్ణ వాక్యాలే అని చెప్పాడు , బాలకృష్ణ ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఎవరో తెలీదని చెప్పాడని అయితే నిజానికి అందరూ అందరికీ తెలియాల్సిన అవసరం లేదని కానీ టీడీపీ తో 2014 ఎలక్షన్స్ లో ఏమి ఆశించకుండా కలిసి పనిచేసి అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం అయిన పవన్ కల్యాణ్ నీ అలా అనటం ఎంతవరకు సబబని ప్రశ్నించాడు. మొత్తానికి నాగబాబు తన వివరణ ఇచ్చాడు అయితే ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా లేదా చూడాలి మరి.