సినిమా :- One Movie (2021)

One movie in telugu: నటీనటులు :- మమ్ముట్టి
నిర్మాతలు:- : శ్రీలక్ష్మి.ఆర్
డైరెక్టర్ :- సంతోష్ విశ్వనాథ్
లాక్ డౌన్ సమయం లో ప్రజలకి ఓటీటీ ద్వారా విడుదలయే సినిమాలు అలరిస్తూ వస్తున్నాయి. ఇపుడు మమ్ముట్టి నటించిన వన్ సినిమా అదే తరహా లో ప్రేక్షకులని అలరించడానికి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇపుడు మనం చూద్దాం.
కథ :-
ఈ కథ ఆవేషంతో ఉన్న యువకుడు సోషల్ మీడియాలో పాలిటిక్స్ మీద పోస్ట్ చేయడంతో మొదలవుతుంది. ఆ పోస్ట్ వళ్ళ రాజకీయాల్లో ఎలాంటి గందరగోళాలు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి అయినా కల్లూరి చంద్రం (మమ్ముట్టి) ఈ పోస్ట్ పై ఎలా స్పందించారు? ఎలాంటి సంఘటనలు ఎదురుకోవాల్సి వచ్చింది? ఆ ఒక పోస్ట్ వళ్ళ సొంత పార్టీ లోనే ఎన్ని విధ్వంసాలు చోటు చేసుకున్నాయి? అసలు ఆ పోస్ట్ ఏంటి ? ఇవ్వని తెలుసుకోవాలనుకుంటే ఈ చిత్రం ఆహ లో చూసేయాల్సిందే.
👍🏻:-
- ఎప్పటిలాగే మమ్ముట్టి తన నటనతో ప్రేక్షకులని అలరించారు. సినిమా మొత్తం తన బుజాల పైన వేసుకొని నడిపేశారు. మిగితా పాత్రలు కూడా తమ నటన మేరకు న్యాయం చేశారు.
- కథ మరియు కథనం కొత్తగా మరియు ఆలోచింపచేసేలా ఉన్నాయి.
- దర్శకుడు ప్రతి చిన్న విషయం చాల క్లియర్ గా చూపించేసి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
- సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
👎🏻:-
- మొదటి 30 నిముషాలు రొటీన్ మరియు బోర్ కోటిస్తాయి.
ముగింపు :-
మొత్తానికి వన్ అనే చిత్రం ప్రేక్షకులని అలరిస్తాది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పటిలాగే మమ్ముట్టి నటన కోసం ఈ సినిమాని చూసేయచ్చు. ఈ లాక్ డౌన్ సమయం లో ఈ చిత్రం ప్రేక్షకులని అలరించడమే కాకా ఆలోచింపచేసేలా కూడా చేస్తుంది. దర్శకుడు కొత్త లైన్ ని తీసుకొని ఎక్కడ మిస్ అవ్వకుండా సినిమా కి న్యాయం చేశారు. ఈ వారం కుటుంబం తో కలిసి ఆనందంగా ఈ సినిమాని చూసేయచ్చు.
One rating:- 2.75/5