News
కిక్కుకోసం .. కన్నకూతురినే అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి !

మద్యం ద్వారా వచ్చే కిక్కుకోసం కన్నా కూతురినే అమ్మకాన్ని పెట్టి సంఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది. మద్యం కోసం మానవసంబంధాలు కూడా కనపడని కలికాలం వచ్చింది.
మహారాష్ట్ర కి చెందిన సతీష్,మీనా లు పొట్టకూటికోసం విజయవాడ కి వలస వచ్చారు. వీరు కూలి పని కోసం నానా కష్టాలు పడుతూ ఎంతో అపురూపంగా పెంచుకున్న తన కూతురినే మద్యం కోసం అమ్మకానికి పెట్టాడు.
కేవలం మద్యంకోసం 5 వేయిలకి అమ్మకానికి పెట్టడంతో అక్కడి ప్రజలు ఈ విషయాన్నీ పోలీసులకు తెలియజేసారు.
ఈ విషయంపై పోలీసులు సతీష్ ని స్టేషన్ కి తీసుకెళ్లి తాను చేస్తున్నపని ఎంత తప్పో తనకి తెలిసేలా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసారు.