Omicron Precautions: ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్య లో నమోదయ్యాయి ? వీటిని కట్టడి చేయడం ఎలా ? :-

Omicron Precautions: దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. జనవరి నెల మొదట్లో 10 నుంచి 15 వేల సంఖ్యలో ఉన్న బాధితులు జనవరి 12 వ తేది వచ్చేలోగా దాదాపు లక్ష 60 వేల సంఖ్య కు చేరింది. ఒక్క వారం రోజుల్లోనే వేల నుంచి లక్షలో లో చేరిన కేసుల గురించి చూస్తేనే మీకు ఈ ఒమిక్రాన్ యొక్క తీవ్రత అర్థం అవుతుంది. కానీ ఎవరూ జాగ్రత్తలు పాటించడం లేదు. పోలీసులు , డాక్టర్లు , వాలంటీర్లు ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా జాగ్రత్తలు పాటించండి అని చెప్పిన చాలా మంది పాటించకపోవడం తో పోలీసులు ఫైన్ వెయ్యడం మొదలుపెట్టారు. మాస్క్ లేకపోతే 1000 రూపాయిలు ఫైన్ వేస్తున్నారు. జాగ్రత్త మరి.
అయితే ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న సమయం లో కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్. కే. అరోడా ప్రజలకు ఈ ఒమిక్రాన్ భారిన పడకుండా జాగ్రత్త గా ఉండటానికి మూడు చిట్కాలు చెప్పడం జరిగింది. అవెంటంటే
- కోవిడ్ నిబంధనలను పాటించడం.
- అర్హులైన వారికి వ్యాక్సిన్ పంపించడం. అర్హులైన వారు వ్యాక్సిన్ వేయించుకునెల సదుపాయాలు కల్పించడం.
- కర్ఫ్యూ మరియు రాష్ట్రంలో పెట్టే ఆంక్షలను క్షున్నంగా పాటించడం.
ఇలా ఈ మూడు చిట్కాలు పాటించండం వలన ఒమిక్రాన్ వంటి వైరస్ ని కట్టడి చేయడం సాధ్యం అవుతుంది.
దీనితోపాటు ఎన్. కే.అరొడా గారు ఐఐటీ. కాన్పూర్ ప్రొఫెసర్ అయిన మనీంద్ర అగర్వాల్ గతం లో చెప్పిన వాఖ్యలు ఇప్పుడు నిజం అవుతున్నాయి అని. వారు పరిశీలించి చెప్పిన విధంగానే జనవరి నెలలో ఒమిక్రాన్ కేసులు తార స్థాయి చేరుతున్నాయి అని, ఇప్పుడు వారు చెప్పిన మాటలే నిజం అవుతున్నాయి అని వెల్లడించారు. కాబట్టి జనవరి చివరిలోగా థర్డ్ వేవ్ కచ్చితంగా రాబోతుంది అని ప్రజలకు తగుజగ్రతలు చెప్పారు.
అయితే గతం లో మున్నింద్ర అగర్వాల్ గారు ఈ థర్డ్ వేవ్ తీవ్రత జనవరి లో మొదలయ్యి మార్చ్ లో తీవ్రత తగ్గిపోతుంది అని వెల్లడించిన విషయం మనకి తెలిసిందే.
ఏది ఏమైనా మీరు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించడం మీ కుటుంబానికి మీరు చేసే అతి పెద్ద మేలు అవుతుంది.