Today Telugu News Updates
Odisha Gas Leakage: ఒడిశాలో ఘోర ప్రమాదం…నలుగురు మృతి
Odisha Gas Leakage: ఒడిశాలో ఘోర ప్రమాదం…నలుగురు మృతి: ఒడిషాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.ఓ స్టీల్ ప్లాంట్ లో గ్యాస్ లీకై నలుగురు చనిపోగా మరికొందరి ఆరోగ్యం విషమంగా ఉంది.

ఒడిషా రాష్ట్రంలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్ లో బుధవారం ఉదయం కెమికల్ డిపార్ట్మెంట్ లో గ్యాస్ లీక్ అవ్వడంతో డ్యూటీలో ఉన్న 15 మంది ఉద్యోగులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పరు. నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్న ఉద్యోగులను స్థానిక ఇస్పత్ జనరల్ హాస్పిటల్ లకి తరలించి చికిత్స అందించారు. అందులో నలుగురు ఉద్యోగులు మృతిచెందగా మిగతా వారి ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.