Tollywood news in telugu
సినిమాల్లో అడుగు పెట్టిన నూతన్ నాయుడు…!
సినిమాల్లో అడుగు పెట్టిన నూతన్ నాయుడు…!

బిగ్ బాస్ 2తో సంచలనాలకు కేంద్ర బిందువైన నూతన్ నాయుడు త్వరలో సినీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న f2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీలో ఒక ముఖ్యమైన పాత్రలో నూతన్ నాయుడు కనిపించబోతున్నాడు.
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ మూవీలో నూతన్ నాయుడు తనదైన శైలిలో యాక్ట్ చేసాడని ఇండస్ట్రీ టాక్. మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
బిగ్ బాస్ షో తో తెలుగు ప్రజలకు చేరువైన నూతన్ నాయుడు ఈ సినిమా రంగంలో కూడా దూసుకుపోవాలని ఆశిద్దాం.